For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టీవీ షోలో తాగి వచ్చి, బూతు పంచాంగం: హీరోయిన్ పై కేసు నమోదు (వీడియో)

  |

  తెలుగు డైరెక్ట్ సినిమాల్లోనూ నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుందిఊర్వశి . మెగా స్టార్ చిరంజీవితోనూ చిందులేసిన ఈ నటి ఇప్పుడు మాత్రం తాగి మరీ చిందులేస్తూ వార్తల్లోకెక్కుతోంది. రెండేళ్ళ కిందట జరిగిన సంగతి గుర్తుండే ఉంతుంది. ఎల్.డి.ఎఫ్ ఆర్గనైజ్ చేసిన ఫీమేల్ లేగిస్లేటివ్ స్టాఫ్ కమీషన్ మీటింగ్ కి ఊర్వశి హాజరు కావాలి. ఈమె ఈ కార్యక్రమానికి ఆలస్యంగా రావడమే కాకుండా, స్టేజ్ మీదకి కూడా తూగుతూ, తూలుతూ వెళ్ళింది. అంతే కాకుండా స్టేజ్ మీద మాట్లాడడం కూడా సరిగా లేదు. తనకి నోటికి ఏదొస్తే అది మాట్లాడేసింది. దాంతో ఆ మీటింగ్ కాస్త డిస్టర్బ్ అయ్యింది. ఊర్వశి ఇలా పబ్లిక్ ఈవెంట్ లో మందు తాగి మత్తులో బిహేవ్ చేయడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో తన విడాకుల కేసు హియరింగ్ కి ఎర్నాకులంలోని ఫ్యామిలీ కోర్టుకు కూడా తాగి వచ్చింది.

  జీవితం సాక్షి

  జీవితం సాక్షి

  ఊర్వశి మలయాళం లో జీవితం సాక్షి అనే ప్రోగ్రాం కు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. మన తెలుగులో కూడా భార్య,భర్తల మధ్య ఉన్న గొడవలను తగ్గించి వరిని కలిపే ప్రయత్నం చేసే రచ్చబండ లాంటి షో ఇది.విడిపోయిన కుటుంబాలను, భార్య భర్తలను, అత్త కోడళ్ళను, మామ అల్లుళ్ళను కలిపే షో ఇది.

  ఊర్వశి ప్రశ్నల వల్లే

  ఊర్వశి ప్రశ్నల వల్లే

  ఈ కార్యక్రమానికి వెళ్ళిన తన భర్త ద్వారా తన కుటుంబ పరువు తీసిందని, ఊర్వశి ప్రశ్నల వల్లే తమ కుటుంబం విడిపోయిందని, తమ కుటుంబాన్ని రచ్చకీడ్చి తమని కలిసేలా చేయకుండా, శాశ్వతంగా తమ ఇంటి గుట్టును బజారున పెట్టిందని కేరళలోని ఒక మహిళ ఆ రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేసింది.

  ఫుల్ గా మందు కొట్టి వచ్చిందట

  ఫుల్ గా మందు కొట్టి వచ్చిందట

  మరో విశేషం ఏమిటంటే ఆమె ఆ కార్యక్రమానికి ఫుల్ గా మందు కొట్టి వచ్చిందట.ఆ కార్యక్రమం లో పాల్గొన్న అందరూ ఆమె ప్రవర్తన చూసి షాక్ అయ్యారు.షో చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఈమె తాగి వచ్చిందని తెలిసిపోయింది.త్రాగి వచ్చి చిన్న విషయాన్ని పెద్దది చేసి రచ్చ రచ్చ చేసింది.

  నవ్వుల పాలైంది

  నవ్వుల పాలైంది

  అయితే ఆమె వల్ల ఒక కుటుంబ గౌరవం సర్వ నాశనం అవ్వడమే కాదు ఆమె కూడా నవ్వుల పాలైంది. కార్యక్రమంలో పాల్గొన్న వారు, షో నిర్వాహకులు, లాయర్లు కూడా ఊర్వశి ప్రవర్తన కి విస్తుపోయారట. కార్యక్రమాన్ని చూసే సాధారణ ప్రేక్షకులు కూడా ఈ విషయాన్ని పసిగట్టారట.

  ఇలాంటి పనుల వల్ల

  ఇలాంటి పనుల వల్ల

  అయితే గతసంవత్సరం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు మళ్ళీ ఆ కేసు నడుస్తున్న క్రమం లో మళ్ళీ తెరమీదకి వచ్చింది. ఇంతకీ అప్పుడేం జరిగిందంటే తాగిన మైకంలో అనవసర ఆవేశంతో నానా హంగామా చేసిందట. ఇలాంటి పనుల వల్ల ఈ నటీ నటులు తమ పరువు బజారుపాలు చేయడమే కాదు ఎన్నో కుటుంబాలను కూడా రచ్చకీడుస్తున్నారని ఇటీవల ఆరోపణలెన్నో.

  అప్పటి వీడియో ఒక సారి

  మరి మానవ హక్కుల సంఘం ఈ విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి. హై సొసైటీలో ఆడవాళ్ళు తాగటం మామూలే అయినా మరీ ఇలా పబ్లిక్ ఫంక్షన్లకూ, వర్క్ చేసే ప్రదేశాలకూ ఇంతగా తాగి వెళ్ళటం మాత్రం ఊర్వశి మీద పలురకాల విమర్శలకు తావిస్తోంది. గతం లో ఫ్యామిలీ కోర్టుకు వచ్చినప్పుడు కూడా విపరీతంగా తాగి వచ్చి మీడియాతో గొడవపడింది అప్పటి వీడియో ఒక సారి చూడండి.

  English summary
  The complaint, filed by Royal Kavadiyar Protection Force president Shefin, also accused Urvashi of appearing Drunk on the TV show " Jeevitham Sakshi"
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X