దర్శకురాలిగా మారబోతున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. ఇక మెగాఫోన్‌తో హంగామా!
దక్షిణాదిలో ప్రతిభ చాటుకొంటున్న యువ హీరోయిన్లలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. విభిన్నమైన పాత్రలతో అద్భుతంగా వెండితెర మీద రాణిస్తున్నారు. తమిళం, తెలుగు చిత్రాలనే తేడా లేకుండా ఫెర్ఫార్మెన్స్‌తో కూడిన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
విశాల్‌తో కలిసి పందెంకోడి, విజయ్‌తో కలిసి సర్కార్ చిత్రంలో విలన్ పాత్రలతో ఆకట్టుకొన్నారు. ఇక ఇటీవల రిలీజైన క్రాక్ సినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ నటనపై సినీ విమర్శకులు ప్రశంసలు గుప్పించారు. తాజాగా విడుదలైన నాంది చిత్రంలో లాయర్ పాత్రలో ఒదిగిపోయారు. ఇలా నటిగా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ఇప్పుడు దర్శకురాలిగా మారేందుకు సంచలన నిర్ణయం తీసుకొన్నారు.

తమిళంలో తెరకెక్కే ఓ భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్దమవుతున్నారు. నటిగానే కాకుండా దర్శకురాలిగా మారి మెగాఫోన్‌తో హంగామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ దర్శకత్వం వహించే చిత్రంలో నటీనటుల ఎంపిక జరుగుతుందని, సాంకేతిక నిపుణులు వివరాలను త్వరలోనే వెల్లడించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











