twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫోటోలు : మనోరమ భౌతిక దేహానికి రజనీ కాంత్ తో సహా స్టార్స్ నివాళి

    By Srikanya
    |

    చెన్నై: సీనియర్‌ నటి మనోరమ (78) చెన్నైలో శనివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. మృతి విషయం తెలిసిన వెంటనే దక్షిణాది సినీ పరిశ్రమ శోక సముద్రంలో మునిగి పోయింది. పలువురు ప్రముఖ తారలు మనోరమ భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

    తెలుగు, తమిళం ఇతర భాషల్లో వెయ్యికిపైగా చలన చిత్రాల్లో నటించారు. బుల్లితెరపై పలు సీరియళ్లలోనూ నటించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. . ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆకస్మికంగా గుండెపోటు రావడంతో శనివారం అర్థరాత్రి మనోరమ తుదిశ్వాస విడిచారు.

    ఎన్నో అద్భుతమైన పాత్రలతో దాదాపు 5 దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తున్న అత్యుత్తమ నటి అశేష అభిమానులను వదిలి వెళ్లిపోయింది. తమిళ, తెలుగు, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో సుపరిచితురాలు. 1960, 1970 దశకాలలో తమిళ వెండితెరను శాసించిన మనోరమ 1937 మే 26న తమిళనాడులోని మన్నార్ గుడిలో జన్మించారు. మనోరమ అసలు పేరు గోపిశాంత.

    భౌతిక దేహాన్ని సందర్శించిన సినీ ప్రముఖులు ఫోటోలు స్లైడ్ షోలో...

    రజనీకాంత్

    రజనీకాంత్

    మనోరమ మరణ వార్త వినగానే రజనీకాంత్ హుటాహుటీన వచ్చి నివాళులు అర్పించారు.

    అనుబంధం

    అనుబంధం

    మనోరమతో తనకున్న అనుబంధం గుర్తు చేసుకుని కన్నీరు పెట్టారు.

    విశాల్

    విశాల్

    తమిళ,తెలుగు హీరో విశాల్ వచ్చి మనోరమకు అంతిమ నివాళలు అర్పించారు.

    హీరో విజయ్

    హీరో విజయ్

    మనోరమ కు హీరో విజయ్ వచ్చి అంతిమ నివాళులు అర్పించారు

    హీరో కార్తి

    హీరో కార్తి

    మనోరమ మృతి వార్త తెలుసుకున్న హీరోకార్తి వచ్చి ఆమెకు నివాళులు అర్పించారు

    స్నేహ

    స్నేహ

    హీరోయిన్ స్నేహ తన భర్త ప్రసన్నతో కలిసి వచ్చి నివాళులు అర్పించారు.

    మనోబాల

    మనోబాల

    తలైవాసల్ విజయ్, మనోబాల వచ్చి మనోరమకు నివాళులు అర్పించారు.

    మన్సూర్ అలీ ఖాన్

    మన్సూర్ అలీ ఖాన్

    నటుడు, దర్సకుడు మన్సూర్ అలీఖాన్ వచ్చి మనోరమకు నివాళులు అర్పించారు.

    కుష్బూ

    కుష్బూ

    కుష్టూ, ఆమె భర్త సుందర్ వచ్చి మనోరమకు నివాళులు అర్పించారు.

    గౌండర్ మణి

    గౌండర్ మణి

    ఆమెతో పలుచిత్రాల్లో కలిసి నటించిన గౌండర్ మణి వచ్చి మనోరమకు నివాళులు అర్పించారు.

    రహమాన్

    రహమాన్

    నటుడు రహమాన్ వచ్చి మనోరమకు నివాళులు అర్పించారు.

    శివకార్తికేయన్

    శివకార్తికేయన్

    నటుడు శివ కార్తికేయన్ వచ్చి మనోరమకు నివాళులు అర్పించారు.

    లారెన్స్

    లారెన్స్

    నటుడు, దర్శకుడు లారెన్స్ తనతో ఎన్నో చిత్రాల్లో నటించిన మనోరమకు నివాళులు అర్పించారు.

    అజిత్

    అజిత్

    తమిళ స్టార్ హీరో అజిత్ మనోరమకు నివాళులు అర్పించారు.

    నాజర్

    నాజర్

    సహ నటిగా తనతో ఎన్నో చిత్రాల్లో నటించిన మనోరమకు నాజర్ నివాళులు అర్పించారు.

    గిన్నీస్ బుక్ లో

    గిన్నీస్ బుక్ లో

    1958 లో మాలిట్టా మంగై అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసిన మనోరమ వెయ్యి సినిమాలకు పైగా నటించి గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించారు.

    ఐదుగురుతో ...

    ఐదుగురుతో ...

    తమిళ చిత్ర పరిశ్రమలో ఆచ్చిగా (బామ్మగా) ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోరమ సినీరంగంలో అయిదుగురు ముఖ్యమంత్రులతో కలిసి పని చేశారు. తెలుగులో ఎన్టీఆర్‌, తమిళంలో ఎంజీఆర్‌, అన్నాదురై, కరుణానిధి, జయలలితతో కలిసి ఆమె పని చేశారు.

    నివాళి...

    నివాళి...

    మనోరమ మృతికి వన్ ఇండియా తెలుగు మనస్పూర్తిగా నివాళులు అర్పిస్తోంది.

    English summary
    Legendary Tamil actress Manorama started her acting career as a drama artist, which was more popular those days. She slowly migrated from dramas to cinemas just as most actors did those days. During her initial days in the cine field, she concentrated more on comedy. She was given equally challenging roles alongside the well known comedian Nagesh. They made an excellent pair and gave many praiseworthy comedies. She died of multiple organ failure in Chennai on Saturday. She was 78. Manorama is survived by her son and singer-actor Boopathy. Manorama was lovingly called Aachi by her admirers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X