‘ఆదిత్య వర్మ’ టీజర్: అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ అదిరిపోయేలా ఉందిగా...
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందిన 'అర్జున్ రెడ్డి' సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రాన్ని తమిళం, హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. తమిళంలో 'ఆదిత్య వర్మ' పేరుతో రూపొందుతుండగా విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు.
తాజాగా 'ఆదిత్య వర్మ' టీజర్ విడుదలైంది. తెలుగు వెర్షన్‌కు సందీప్ రెడ్డి వద్ద అసిస్టెంటుగా పని చేసిన గిరీశాయ దర్శకత్వం వహించారు. ఒరిజినల్ వర్షన్ ఏ మాత్రం మార్చకుండా.... సీన్ టు సీన్ రీమేక్ చేశారు. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. విక్రమ్ కుమారుడు ధృవ్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది.

తొలుత బాలా దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా.. ఫైనల్ కాపీ చూసిన చిత్ర నిర్మాతలు (ఇ4 ఎంటర్టెన్మెంట్స్) తాము కోరుకున్న విధంగా సినిమా రాలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ... కొత్త దర్శకుడు, కొత్త టెక్నీషియన్లతో సినిమా మళ్లీ తీశారు.
ఈ వివాదంపై తాను మాట్లాడటం మొదలు పెడితే 'ధృవ్' భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది. అందుకే ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నానని బాలా ఎలాంటి గొడవ చేయకుండా ఈ సినిమా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
'ఆదిత్య వర్మ' రిలీజ్ ఎప్పుడనే విషయం ఇంకా నిర్ణయించలేదు. మరో వైపు 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' జూన్ 21న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో షాహిద్ కపూర్, కియారా జంటగా నటిస్తుండగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











