అనూష్క అయింది ఇక త్రిష
అనూష్క ప్రధాన పాత్రలో రూపొందిన అరుంధతి చిత్రం తమిళంలో అదే పేరుతో డబ్బింగ్ అయిందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రూటులో త్రిష హీరోయిన్ గా నటించిన కృష్ణ చిత్రాన్ని మధుర తిమురు అనే టైటిల్ తో వచ్చే నెలలో రిలీజ్ అవుతోంది. వి.వి.వినాయిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రవితేజ హీరోగా నటించాడు. అయితే అక్కడ పోస్టర్స్, ట్రైలర్స్ లలో త్రిషను హైలెట్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు. కామిడీ ఎంటర్టైనర్ గా తయారైన ఈ చిత్రంలో మేజర్ సన్నివేశాలు రీసెంట్ తమిళ సినిమాల నుండి ఎత్తిపోసినవి కావటంతో వెంటనే డబ్బింగ్ చేయలేదు. కానీ ఇప్పుడు త్రిష పేరుతో శాటిలైట్ మార్కెట్ వస్తుంది, ఆడినన్ని రోజులు ఆడుతుందనే ధైర్యంతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అలాగే అనూష్క గత చిత్రాలు కూడా ఇప్పుడు వరసలో డబ్బింగ్ అవుతున్నాయి. అలా అనూష్క దారిలో త్రిష ప్రయాణం పెట్టుకుంది.


Click it and Unblock the Notifications











