రజనీకాంత్ హిమాలయాల నుండి తిరిగి రాగానే ఆయనకు డబుల్ బొనాంజా...
ఇటీవలే, రజినీకాంత్ సినిమా 'రోబో' బాక్స్ ఆఫీసులు లో సెన్సేషన్ ని సృష్టించింది. ఆశించిన దానికంటే ఎక్కువ కల్లెక్షన్ లు వచ్చాయి. ఇప్పటి కూడా కొన్ని ప్రాంతాల్లో, అదీ సెలవు రోజుల్లో అస్సలు టికెట్స్ దొరకట్లేదట. అది అలా ఉంటె, 'రోబో' నే రజినీకాంత్ ఆఖరి సినిమా అని కొందరు అన్నారు. కానీ ఇప్పుడు నిజం కాదని అనిపిస్తోంది. ఎందుకంటే, కే.ఎస్.రవి కుమార్ దర్శకత్వం లో మరో సినిమా చేయబోతున్నాడని వార్తలోచ్చాయ్. ఇంతకముందు, వీళ్లిద్దరూ కలిసి 'నరసింహా' సినిమా చేసారు. ఆ సినిమా లో రమ్య కృష్ణ పాత్ర (నీలాంబరి) ఎంత హిట్ అయ్యిందో అందిరికి గుర్తుండే ఉంటుంది.
ప్రస్తుతం, రజినీకాంత్ హిమాలయాల్లో హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ట్రిప్ నుంచి తిరిగి రాగానే, ఆయన కొత్త సినిమా షూటింగ్ మొదలుపెడతాడని సమాచరం. అంతే కాదు, రజినీకాంత్ 'బాష' రిమేక్ కూడా చేయబోతున్నాడట. మరి అది ఎంత వరకు నిజమో వేచి చూద్దాం.


Click it and Unblock the Notifications











