నయనతారా అదేం పని?

ఇక హఠాత్తుగా నయనతారకేం పని వచ్చింది గుడి స్వంతంగా కట్టుకోవటానికీ అంటే..మరేమీ లేదుట...జోతిష్యం పై నమ్మకమే ఈ పనిచేయించిందని సమాచారం. వారు చెప్పిన దాని ప్రకారం ఆమె ఇక్కట్లు తప్పటానికి దిష్టి దోషం పోయి కెరీర్ సెటిల్ అవ్వటానికి ఈ పని చేసిందిట. జోతిష్య నిపుణుల సూచన మేరకు తమిళనాడులోని ఒక మారు మూల గ్రామంలో తన సొంత డబ్బుతో గుడి కట్టించి, దాన్ని అభిమానులు కట్టించినట్టుగా ప్రచారం చేస్తోందట.
ఆమెకు దిష్టి దోషం ఉందని, దీన్ని పోగొట్టుకునేందుకే ఇలా చేయమని జోతిష్కులు చెప్పినట్టు చెన్నై సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇది చేసిన వెంటనే మిస్ అయిన ఛాన్స్‌లు తిరిగి రావటం, నిర్మాతల మండలి బహిష్కరణ తొలిగింపబడటం, తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ వంటివారు సరసన ఆఫర్,బోయపాటి సినిమాలో ఆఫర్ వచ్చాయిని చెప్తున్నారు. ఎవరి నమ్మకాలు వారివి. అయితే కొందరు విశ్లేషకులు మాత్రం ఇలా సినీతారలు తమ తమ మూఢ నమ్మకాలతో ఇష్టమొచ్చినట్లు ముందుకెళ్తే వారిని గుడ్డిగా అనుకరించే అభిమానులు ఇబ్బందిపడతారని అంటున్నారు. ఇదీ ఆలోచించాల్సిందే.


Click it and Unblock the Notifications











