ఆ సౌత్ సీక్వెల్‌కి ఏకంగా 8 గంటల ఫుటేజ్.. ఏ సినిమా అంటే?

కొన్ని సినిమాలకి ఆ చిత్రం అందించే ఎంటర్టైన్మెంట్ ని బట్టి వాటి నిడివి కూడా లెక్కలోకి వస్తుంది. అయితే కొన్ని సినిమాలు కంటెంట్ లేకపోయినా అలా సాగదీస్తూ వెళ్తుంటారు. దీనితో చాలా సినిమాలు ప్లాప్ అవుతూ ఉంటాయి. ఇక మన తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు అయితే ఒకప్పుడు ఎక్కువ నిడివి ఉండేవి కానీ రాను రాను తగ్గించారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే పలు సినిమాలు ఏకంగా 3 గంటల నుంచి ఆ మార్క్ ఏకంగా 3 గంటల 20 నిమిషాల వరకు వచ్చింది. ఈ మధ్య కాలంలో పలు భారీ సినిమాలు ఆల్ మోస్ట్ కంటెంట్ రీత్యా 3 గంటలు దగ్గరకు వస్తేనే ఓహో అని చాలా మంది అనుకున్నారు. కానీ గత ఏడాది వచ్చిన అనిమల్ సినిమా ఏకంగా 3 గంటల 20 నిముషాల రన్ టైం తో వచ్చింది.

After pushpa 2 this south sequel footage got 8 hours

అలా వచ్చినా కూడా ఆడియెన్స్‌ని థియేటర్స్‌లో సీట్లలో కూర్చోబెట్టింది. ఈ సినిమా తర్వాత ఈ ఏడాది చివరిలో వచ్చిన భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 కూడా ఇంతే రన్ టైం తో వచ్చి ఇది కూడా థియేటర్స్ లో జనాన్ని కూర్చోపెట్టి అదరగొట్టింది. ఈ తరహా సినిమాలు షూటింగ్ చేసినప్పుడే భారీ రన్ టైంతో డెఫినెట్ గా వస్తాయి.

అదంతా కట్ చేసి చాలా సీన్స్ లేదా సాంగ్స్‌ని నిడివి పేరు చెప్పి కట్ చేసి ఒక 3 గంటల సమయంతో తీసుకొస్తారు. కానీ ఆ తర్వాత కొన్ని కొన్ని సీన్స్ డిలీట్ చేసినవి వేరేగా విడుదల చేస్తారు. మరి ఈ ఏడాదిలో వచ్చిన మరో సినిమా అది కూడా సీక్వెల్ సినిమా దాదాపు 3 గంటల నిడివితో వచ్చింది.

ఇంట్రెస్టింగ్ గా చాలా సీక్వెల్ సినిమాలు దాదాపు మూడు గంటల నిడివిలో వచ్చాయి. ఈ సినిమాల్లో బాహుబలి 2, కేజీఎఫ్ 2 లు దాదాపు మూడు గంటల రన్ టైం లోనే వచ్చాయి. ఇక లేటెస్ట్ గా వచ్చిన పుష్ప 2 సినిమా కూడా ఏకంగా 3 గంటల 20 నిమిషాలకి పైగా వచ్చింది.

After pushpa 2 this south sequel footage got 8 hours

ఈ సినిమా తర్వాత వచ్చిన లేటెస్ట్ తమిళ సినిమా "విడుదల 2" కూడా వచ్చింది. ఇది కూడా సుమారు 3 గంటల దగ్గర రన్ టైంతోనే రిలీజ్ కి వచ్చింది. కానీ ఈ సినిమాకి షాకింగ్ గా ఫుటేజ్ ఎంత వచ్చిందో దర్శకుడు వెట్రిమారన్ రివీల్ చేశారు. థియేటర్స్ లోనే సినిమా నిడివి 3 గంటలు అయితే షూటింగ్ చేసిన ఫుటేజ్ ఏకంగా 8 గంటలు వచ్చిందట.

అంటే 5 గంటల రన్ టైంని కట్ చేసి మూడు గంటల నిడివితో సినిమా విడుదల చేసారని చెప్పాలి. కాగా పార్ట్ 1 హిట్ అయ్యాక పార్ట్ 2 షూటింగ్ మాత్రం త్వరగానే పూర్తి చెయ్యాలని చూసారు. కానీ ఇది తర్వాత పెరుగుతూ వచ్చేసింది. దీంతో సినిమా అనుకున్న దాని కంటే ఎక్కువగా వచ్చేసి ఉండొచ్చు. మరి మిగిలిన 5 గంటల ఫుటేజ్ ఏం చేస్తారో చూడాలి. కాగా ఈ సినిమాలో తమిళ విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే సూరి నటించగా మొదటి పార్ట్ లో సూరిని హైలైట్ చేసిన దర్శకుడు రెండో భాగానికి విజయ్ సేతుపతిని హీరోగా పెట్టి చేసాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X