మామ కే కాదు... అల్లుడుకీ ఆమే

ధనుష్‌తో 'పొల్లాధవన్', 'ఆడుగలం' రూపొందించిన వెట్రిమారన్ మూడో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. గత సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో మూడో చిత్రం కూడా కచ్చితంగా విజయం సాధించేలా తీర్చిదిద్దాలన్న ఆలోచనలో ఉన్నారట వెట్రిమారన్. ఇందులో భాగంగానే అగ్ర నటులను ఎంపిక చేయాలనే నిర్ణయానికొచ్చారట. ధనుష్‌కు జంటగా సోనాక్షిసిన్హాను ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నారట.
ధనుష్ బాలీవుడ్‌కూ పరిచయమైన నేపథ్యంలో సోనాక్షితో జోడీ కట్టిస్తే ఆ సినిమాకు హిందీలోనూ క్రేజ్‌ను తీసుకురావొచ్చని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. సోనాక్షి కూడా ఇందుకు సముఖంగానే ఉన్నట్లు సమాచారం. రెమ్యునేషన్ సైతం ఆమెకు భారీగా ముట్టచెప్పటానికి సిద్దపడుతున్నారని చెప్తున్నారు. అయితే పాత్ర విని ఆమె ఫైనలైజ్ చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.
మరో ప్రక్క మహేష్ బాబు కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన 'ఒక్కడు (2003) చిత్రాన్ని హిందీలో బోనీ కపూర్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో మహేష్ బాబు పాత్రను బోనీకపూర్ తనయుడు అర్జున్ కపూర్ పోషించ బోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సోనాక్షి సిన్హాని ఎంపిక చేసారు. తెలుగులో భూమిక చేసిన ఈ పాత్రలు చాలా ప్రాముఖ్యత ఉంది. దాంతో రకరకాల హీరోయిన్స్ ని అనుకుని చివరకు సోనాక్షి ని ఫైనలైజ్ చేసారు.


Click it and Unblock the Notifications











