Don't Miss!
- News కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతే..: జగన్ నోటి వెంట జాతీయ రాజకీయాలు
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్‌తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
సూర్య బాటలోనే మరో స్టార్ హీరో కూడా.. అంత పెద్ద సినిమా ఓటీటీ అంటే..?
సినిమా ఇండస్ట్రీలో ఓటీటీ అనేది ఇప్పుడు మరో మినీ థియేటర్ లా మారుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద సినిమాలు కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లోనే దిగుతుండడంతో భవిష్యత్తులో కూడా అంతకంటే హై రేంజ్ బడ్జెట్ సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు అర్ధమవుతోంది. అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతోంది అనగానే డిజిటల్ బిజినెస్ పై ఒక నమ్మకం ఏర్పడింది.
ఇక ఇటీవల కోలీవుడ్ లో సూర్య కూడా "ఆకాశమే హద్దురా" అనే సినిమాను అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 30న రిలీజ్ చేయబోతున్నట్లు ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కరోనా కాలంలో ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ కావని చాలా మందికి ఒక క్లారిటీ అయితే వస్తోంది. అందుకే షూటింగ్ పూర్తయిన సినిమాలను ఆలస్యంగా విడుదల చేస్తే మొదటికే మోసం వచ్చే ఛాన్స్ ఉందని ఓటీటీలో రిలీజ్ చేసి నష్టాల భారిన పడకుండా జాగ్రత్త పడుతున్నారు.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. కోలీవుడ్ లోనే మరో స్టార్ హీరో విజయ్ కూడా తన మాస్టర్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. కోలీవుడ్ లో ప్రస్తుతం ఇద్దరు స్టార్ హీరోలు డిజిటల్ రిలీజ్ కి సిద్ధమవుతున్నట్లు టాక్ రాగా అప్పుడే సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక మరో హీరో విజయ్ కూడా ఓకే అన్నట్లు సమాచారం. అయితే సూర్య సినిమా అంటే పెద్దగా 60కోట్లు కూడా ఖర్చయ్యి ఉండదు. కానీ మాస్టర్ సినిమాకు 150కోట్లకి పైగా ఖర్చు చేశారు. ఇంత పెద్ద సినిమాను ఎంతో కొంత లాభానికి అమ్మితే గాని వర్కౌట్ కాదు. మరి చిత్ర నిర్మాతలు ఏ విదంగా డీలింగ్ సెట్ చేసుకుంటారో చూడాలి.