సవతి తల్లి సోదరుడి నిజాలు బయటకు.. శరత్ కుమార్ కుమార్తె ఏం చేసిందో తెలుసా!
తనుశ్రీ సంచలన ఆరోపణలతో మొదలైంది మీ టూ క్యాంపైన్ ఇప్పుడు దక్షణాది చిత్ర పరిశ్రమకు కూడా చేరింది. జాతీయం మీడియాలో ఎడతెరిపి లేకుండా మీ టూ క్యాంపైన్ గురించి చర్చ జరుగుతోంది. తనుశ్రీ దత్త, కంగనా రనౌత్, ఇతర నటీమణులంతా తమకు ఎదురైనా చేదు వాస్తవాలని బట్టబయలు చేస్తున్నారు. సింగర్ చిన్మయి కూడా ఇటీవల సంచలన ఆరోపణలు చేసింది. తాజగా ఓ మహిళా తమిళ సీనియర్ నటుడు రాధా రవిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

అలాంటి సంఘటనే
వైరముత్తు లైంగిక వేధింపుల గురించి విన్నా. అలాంటి ఘటనే నా జీవితంలో కూడా జరిగిందంటూ ఓ యువతకి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆమె చేసిన ఆరోపణలు సంచలనంగా ఉన్నాయి. సీనియర్ నటుడు రాధా రవి తనని లైంగికంగా వేధించాడంటూ ఆ యువత ట్వీట్ చేసింది.

ఇంటికి పిలిచి
ఓ పని నిమిత్తం ఆయన ఆళ్వార్ పేట్ లోని తన నివాసానికి పిలిచారు. ఆహ్వానించడంతో నేను వెళ్లాను. వెళ్ళగానే తనని బలవంతంగా కౌగిలించుకుని ముద్దు పెట్టాడని ఆ యువతి ఆరోపిస్తోంది. మనిద్దరం మళ్ళీ కలుద్దాం. ఈ సారి ఒంటరిగా రా. నీ ఫ్రెండ్స్ ని తీసుకుని రావద్దు అని చెప్పాడు.

రాజకీయంగా పలుకుబడి
ఆయనకు రాజకీయంగా పలుకుబడి ఉంది. అందుకే ఆ సమయంలో ఈ విషయాన్ని బయట పెట్టలేదని ఆ యువతి పేర్కొంది. ఇప్పుడు మీ టూ క్యాంపైన్ నడుస్తుండడంతో రాధా రవి గురించి సంచలన నిజాలు బయట పెట్టింది. ఈ ఆరోపణల పట్ల 66 ఏళ్ల రాధారవి ఎలా స్పందిస్తారో చూడాలి.

సవతి తల్లి సోదరుడే
ఈ ఘటనలో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. ఆ యువతి ట్వీట్ ని నటి వరలక్ష్మి శరత్ కుమార్ షేర్ చేసింది. వరలక్ష్మి సవతి తల్లి అయిన సీనియర్ హీరోయిన్ రాధిక సోదరుడే ఈ రాధారవి. దీనితో శరత్ కుమార్ కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తమిళ సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











