హీరో శింబు కూడా మోసం చేసి వదిలేసాడని..
నయనతారను ప్రభుదేవ మోసం చేసాడంటూ ఆమె చిన్నాన్న, పిన్నమ్మలు మీడియాకు ఎక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంబత్తూరులో వారు మీడియోతో మాట్లాడుతూ ప్రభుదేవాతో పాటు వారు శింబుని కూడా రోడ్డెకెక్కించారు. వారు మాట్లాడుతూ...మొదట్లో శింబు కూడా నయనతారతో ప్రేమకబుర్లు చెప్పి, డబ్బులు దండుకున్నాడని తెలిపారు. ఆయన దర్శకత్వం వహించి, నటించిన వల్లవన్ చిత్రానికి నయనతార ఆర్థికంగా సాయం చేశారన్నారు. శింబు వ్యవహారం నుంచి బయటపడి ప్రభుదేవాకు దగ్గరైన క్షణంలో తమ కుటుంబం చాలా సంతోషపడిందన్నారు. అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేద ని కన్నీటి పర్యంతమయ్యారు.
సినిమాలకు నయనతార గుడ్‌బై చెబుతుందంటూ వార్తలు వెలువడడంతో కంగుతిన్న ప్రభుదేవా నెమ్మదిగా ఆమె నుంచి దూరం అయ్యారని అన్నారు. నటించకపోతే డబ్బులు రాలవని గ్రహించిన ప్రభుదేవా పథకం ప్రకారం నయనతారను మోసం చేశాడని అన్నారు. నయనతార కుటుంబ సభ్యులు చేసిన ఈ ఆరోపణలు కోలీవుడ్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ గొడవలోకి మర్చిపోయిందనుకున్న శింబు ప్రేమ వ్యవహారం తీసుకు వస్తాడని ఎవరూ ఊహించలేదు.


Click it and Unblock the Notifications











