అందుకే లావు అయ్యా..మీరా జాస్మిన్

By Staff

మీరాజాస్మిన్ కి అబార్షన్ అయింది..అందుకే ఒళ్ళు వచ్చింది అనే మాటలను ఆమె తేలిగ్గా కొట్టిపారేశింది. అంతేగాక తను బరువు బాగా పెరిగానంటూ మీరాజాస్మిన్ స్వయంగా ఒప్పుకుంది. అంతే గాక దానికి కారణం కూడా చెప్పుకొచ్చింది. ఆస్ట్రేలియాకి పాట షూటింగ్ నిమిత్తం వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం నాకు సూట్ కాలేదు. అదే నా శరీరంపై విపరీత ప్రభావం చూపింది. ఆ తర్వాత డాక్టర్స్ ని సంప్రదించాను. మెల్లిగా తగ్గుతుందని చెప్పారు. మందులు వాడితే చెడు ప్రభావం ఉంటుందన్నారు. అలాగే నాకు మరీ జీరో సైజ్ లనేవి ఇష్టం ఉండవు. అయినా ఈ రూమర్స్ గొడవ ఎక్కువయి పోయింది అంటూ విసుక్కుంది.

అలాగే మీరా తనకు ఆఫర్స్ తగ్గుతున్నాయని గ్రహించి ఇండస్ట్రీకి పలు సంకేతాలు పంపుతోంది. నా ప్రక్కన చేసే హీరోలు ఎంత వయస్సు ఉన్నవారైనా ఓకే. విజయ్ కాంత్ వంటి సీనియర్ హీరో ప్రక్కన ఛాన్స్ వచ్చినా కాదనను. అయితే నా రోల్ మాత్రం మీనింగ్ ఫుల్ గా ఉండాలి. అయినా హీరో ఇలా ఉండాలి, అలా ఉండాలి అని పెట్టుకుంటే నేను అవార్డు వచ్చిన అన్ని సినిమాలు చేసి ఉండకపోదును. మళయాళంలో పృధ్వీరాజ్, నరేన్ వంటి వారు కొత్త గా పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు చేసాను. అలాగే వయస్సు మీదపడతున్న తెలుగు హీరోల ప్రక్కనా చేసాను. స్క్రిప్టు, నా పాత్ర అధ్బుతంగా ఉంటే రెమ్యునేషన్ కూడా పట్టింపు కాదు అంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X