అదీ ఆయన స్టామినా.....శాటిలైట్ రైట్స్ 22 కోట్లు?

By Bojja Kumar

హైదరాబాద్: ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్.....పలు భారీ చిత్రాలు తెరకెక్కించిన రికార్డు స్థాయి విజయాలను తనఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఆయన తమిళంలో ‘ఐ' (తెలుగులో మనోహరుడు) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళ హీరో విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈచిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్.

శంకర్ సినిమాలకు క్రేజ్ ఏ రేంజిలో ఉంటుందో మరోసారి ప్రూవ్ అయింది. ‘ఐ' చిత్రం శాటిలైట్ రైట్స్ తమిళ ఛానల్ జయా టీవీ రూ. 22 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇంత భారీ మొత్తానికి శాటిలైట్స్ అమ్ముడు పోవడం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

Ai’s satellite rights sold for a record price

భారీ చిత్రాల నిర్మాణ సంస్థ అస్కార్ ఫిలిమ్స్ ప్రై.లి. బ్యానర్ పై అస్కార్ రవిచంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 185 కోట్ల భారీ బడ్జెట్, హలీవుడ్ సాంకేతికతో ఈ సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17 భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహించిన రోబోను 9 భాషల్లో విడుదల చేశారు. ఇప్పుడు రజనీకాంత్ నటిస్తున్న కోచ్చడయాన్ ను 15 భాషల్లో విడుదల చేస్తున్నారు. ఆ సినిమాను మించి తన ఐను 17 భాషల్లో విడుదల చేయడానికి శంకర్ ప్లాన్ చేస్తున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X