త్రిషనే కాదు.. రిసార్టులో మరికొందరు హీరోయిన్లు, టెలివిజన్ స్టార్స్.. బాంబు పేల్చిన రాజకీయ నేత
తమిళ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు ఇంకా మరిచిపోకముందే టాప్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరో వివాదంలో చిక్కుకొన్నారు. తమిళ రాజకీయాల నేపథ్యంలో అన్నాడీఎంకే నేత ఏవీ రాజా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు సంబంధం లేని విషయంలోకి త్రిషను లాగడం అత్యంత వివాదంగా మారింది. అయితే ఏవీ రాజా చేసిన అభ్యంతరకరమైన, దిగజారుడు వ్యాఖ్యలపై నెటిజన్లు, సినీ ప్రముఖులు భగ్గుమంటున్నారు. ఏవీ రాజా చేసిన తాజా వివాదాస్పద వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..
తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు కొనసాగింది. శశికళ, పన్నీరుసెల్వం వర్గాలు తమ అధిపత్యాన్ని నిరూపించుకొనేందుకు ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో పార్టీ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసినంత పనిచేసి రిసార్టుల్లో పెట్టారు. వారిని రకరకాలుగా ప్రలోభాలకు గురిచేశారని ఏవీ రాజా బయటపెట్టడం సంచలనంగా మారింది.

అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తమ ఆధీనంలో ఉంచుకొనేందుకు రెండు వర్గాలు తమతమ క్యాంపులను ఏర్పాటు చేశారు. శశికళ వర్గం చెన్నైలోని కూవథూర్‌కు సమీపంలోని సముద్ర తీరంలో ఓ రిసార్టులో ఎమ్మెల్యేను బంధించినంత పనిచేశారు. అక్కడ వారికి సకల మర్యాదలు చేసి ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు చేశారు.
అయితే రిసార్డుకు తరలించిన ఎమ్మెల్యేలకు భారీగా నగదు, కిలోల కొద్ది బంగారం ఇచ్చారు. కానీ ఓ ఎమ్మెల్యే ఇవియే కాకుండా తనకు త్రిష కావాలని అడిగాడు. అయితే పొలిటిషన్‌గా మారిన ఓ యాక్టర్ తన పలుకుబడిని ఉపయోగించారు. 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆమెను రిసార్టుకు రప్పించారు అని ఏవీ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ రిస్టార్టులో కేవలం త్రిషా మాత్రమే కాదు.. ఇంకా కొంత మంది తమిళ హీరోయిన్లు, టెలివిజన్ సీరియల్ యాక్టర్లు కూడా వచ్చారు అంటూ మరో బాంబు పేల్చారు. ఏవీ రాజు వీడియో ఇంటర్వ్యూలో తమిళ మీడియాలోనే కాకుండా జాతీయ మీడియాలో కూడా సంచలనం రేపింది.
దాంతో అన్నాడీఎంకే నేత ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలపై త్రిష స్పందించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన కామెంట్స్ దిగజారుడుతనానికి అద్దం పట్టేలా ఉన్నాయి. వెంటనే క్షమాపణ చెప్పాలి. సారీ చెప్పకపోతే.. లీగల్ యాక్షన్ తీసుకొంటాను అని ట్విట్టర్‌లో హెచ్చరించింది.


Click it and Unblock the Notifications











