Trisha త్రిషకు 25 లక్షలు ఇచ్చి రిసార్టుకు.. రాజకీయ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. స్టార్ హీరోయిన్ రియాక్షన్ ఏమిటంట
సినీ నటి త్రిష మరోసారి తనకు సంబంధం లేని వివాదంలో చిక్కుకొన్నారు. ఆమెను ఉద్దేశించి అన్నాడీఎంకే నాయకుడు ఏవీ రాజు మీడియాతో మాట్లాడుతూ దారుణమైన వ్యాఖ్యలు చేయడం భారీ వివాదంగా మారింది. త్రిష ప్రతిష్టకు భంగం కలిగే విధంగా, ఆమె మనోభావాలు దెబ్బ తీసే విధంగా కామెంట్ చేయడం నెటిజన్ల ఆగ్రహానికి గురిచేసింది. త్రిషపై ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలు ఏమిటి? త్రిష ఏమని హెచ్చరించిందనే విషయంలోకి వెళితే..
ఇటీవల అన్నాడీఎంకే నేత ఏవీ రాజు రిపోర్టలతో మాట్లాడుతూ.. 2016లో జయలలిత మరణం తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంతో కలువకుండా చాలా చర్యలు తీసుకొన్నారు. చెన్నైలోని కూవథూర్‌కు సమీపంలోని సముద్ర తీరంలో ఓ రిసార్టులో ఎమ్మెల్యేను తరలించారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యేలను తమ ఆధీనంలో ఉంచుకొనేందుకు రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. సలెం పశ్చిమ ఎమ్మెల్యే జీ వెంకటాచలంపై ఆరోపణలు చేస్తూ.. త్రిషను 25 లక్షల డబ్బులు ఇచ్చి రిసార్టుకు తెచ్చుకొన్నారు అని తన వీడియో ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనంగా మారింది.
తమిళనాడు మీడియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారి తీసిన ఏవీ రాజు వివాదాస్పద వ్యాఖ్యలపై త్రిషా కృష్ణన్ తీవ్రంగా ఖండించింది. నీతిమాలిన రాజకీయ నేత అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్లిసిటీ కోసం తమ జీవితాలను ఎంత దిగజారుతారో అనే దానికి ఇది పరాకాష్టం. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండటం అత్యంత దారుణం. తనపై అవాస్తవాలను ప్రచారం చేసిన ఈ వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకొంటాం. నా లీగల్ టీమ్ తదుపరి యాక్షన్ తీసుకొనేందుకు సిద్దమైంది అని త్రిష ట్వీట్ చేసింది.
అన్నా డీఎంకే నేత ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని ఊరికే వదిలిపెట్టకూడదు. వెంటనే లీగల్ యాక్షన్ తీసుకోవాలి అని అభిమానులు డిమాండ్ చేశారు. త్రిషాకు అండగా ఉంటామని వారు ట్వీట్స్ పోస్టు చేస్తూ నైతికంగా సపోర్ట్ చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం త్రిషను టార్గెట్ చేస్తూ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లియో సినిమాలో త్రిష నటిస్తుందని చెప్పిన తర్వాత ఆమెతో నాకు బెడ్ రూమ్ సీన్లు ఉంటాయని అనుకొన్నాను. ఆమె వీలైతే రేప్ సీన్ ఉంటుందని ఆశించాను. కానీ అలాంటి సీన్లు లేకపోవడంతో నిరాశపడ్డానని అనడం వివాదాస్పదంగా మారింది. ఈ కామెంట్లపై త్రిషతోపాటు కుష్బూ, చిరంజీవి ఘాటుగా స్పందించారు.


Click it and Unblock the Notifications











