రజనీకాంత్,అభిషేక్ బచ్చన్ హీరోలుగా ఐశ్వర్యా రాయి తో ప్లాన్ చేస్తున్న శంకర్ క్రేజీ ప్రాజెక్టు 'రోబో' మరో ఇబ్బందిని ఎదుర్కోబోతోంది.దీని నుంచి ఐశ్వర్యా రాయి బయిటకు వచ్చినట్లే అంటున్నారు.శంకర్ ఆమెకి 'నాలుగు కోట్లు రూపాయలు రెమ్యునేషన్ ఇస్తా... రెండేళ్ళ పాటు డేట్స్ కావాలి' అని అడిగాడట.ఐశ్వర్య అలా అంత కాలం పాటు డేట్స్ ఇవ్వటం కష్టమని కావాలిస్తే అందరి కన్నా కొద్ది రోజులు ఎగస్ట్రా గా కేటాయించగలను అని తేల్చి చెప్పిందిట.కాని శంకర్ ఒప్పుకోలేదుట. ఐష్ ప్రాజెక్టు బై చెప్పేలా ఉందిట.దాంతో శంకర్ 'ఓం శాంతి ఓం' తో ఎంట్రీ ఇచ్చిన హాట్ హీరోయిన్ దీపికా పడుకొనీ ని ఎప్రోచ్ అవుతున్నాడట .ఇప్పుడు ఇలా జరగగానే ఐష్ కూడా రమేష్ సిప్పీని వెంటనే కలసిందిట.రోబో కోసం రమేష్ సిప్పీ హ్యాపీ బర్తడే సినిమాకి సారి చెప్పిందిట.ఇలా కూల్ గా ఎవరి ఆల్టర్నేటివ్స్ వాళ్ళు చూసుకుంటుండటంతో అందరూ షాకయి చూస్తున్నారట.ఇందులో అంతా పెద్దవాళ్ళు ఉండటంతో ఎవరూ వేలు పెట్టడానికి సర్ధి చెప్పటానికి ధైర్యం చేయలేకపోతున్నారుట.దాంతో 'జీన్స్' మేజిక్ రిపీట్ అవుతుందని ఆశించిన వాళ్ళకి నిరాసే.