twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    6 కోట్ల పరిహారం: కోర్టుకెక్కిన రజినీకాంత్ కూతురు

    ఆశ్రమ పాఠశాల వ్యవహారంపై రూ.6 కోట్లు పరువు నష్టం కోరుతూ రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య ధనుష్‌ సోమవారం చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

    |

    ఆశ్రమ పాఠశాల వ్యవహారంపై రూ.6 కోట్లు పరువు నష్టం కోరుతూ రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య ధనుష్‌ సోమవారం చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే...స్థానిక గిండీ సమీపంలోని రేస్‌ కోర్స్‌ రోడ్డులో రజనీకాంత్‌ ఆశ్రమ పాఠశాలను నడుపుతున్నారు.

    ఏకంగా పాఠశాలకి తాళం

    ఏకంగా పాఠశాలకి తాళం

    గతం లోనూ రజినీ స్కూల్ మీద విమర్శలు వచ్చాయ్... నోట్ల రద్దు సమయం లో స్కూల్ వ్యాన్ డ్రైవర్స్ కు ఇవ్వాల్సిన జీతం చెల్లించలేదట. దీనికోసం డ్రైవర్స్ ధర్నాకు కూడా దిగారట. పరిస్థితి మేనేజ్మెంట్ నుండి లత రజినికాంత్ దగ్గరకు చేరేసరికి వారు కూడా షాక్ తిన్నారు. తర్వాత ఆ వివాదమూ పరిష్కరించారు. అయితే ఇప్పుడు ఏకంగా పాఠశాలకి తాళం వేసేదాక వచ్చింది పరిస్థితి.

    హైకోర్టును ఆశ్రయించారు

    హైకోర్టును ఆశ్రయించారు

    ఈ పాఠశాల స్థల యజమాని వెంకటేశ్వర్లు అద్దె ఇవ్వలేదని గత 15న పాఠశాలకు తాళం వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఐశ్వర్య హైకోర్టును ఆశ్రయించారు. నిన్న ఆమె దాఖలు చేసిన పిటిషన్‌లో శ్రీ రాఘవేంద్ర విద్యాసంఘాన్ని 1991లో రిజిస్టర్‌ చేసినట్లు తెలిపారు. ఈ సంఘం ద్వారా ఆశ్రమం పేరుతో వేలచ్చేరి, గిండీ, సైదాపేటలో పాఠశాలలు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.

    ఆశ్రమంలోకి చొరబడి

    ఆశ్రమంలోకి చొరబడి

    వీటిలో గిండీ రెస్‌కోర్స్‌ రోడ్డులో పాఠశాలను 2005లో స్థల యజమాని వెంకటేశ్వర్లు వద్ద లీజ్‌కు తీసుకుని పాఠశాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో గత మే వరకూ అద్దె చెల్లించినట్లు తెలిపారు. ఈ స్థితిలో ఈ నెల 15న వెంకటేశ్వర్లు ఆశ్రమంలోకి చొరబడి అద్దె ఇవ్వడం లేదంటూ పాఠశాలను మూసివేశారన్నారు.

    పాఠశాల సంఘం పేరుకు కళంకం

    పాఠశాల సంఘం పేరుకు కళంకం

    అద్దె చెల్లించని కారణంగా ఆశ్రమ పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకున్నామని మీడియాకు ప్రచారం చేశారని పేర్కొన్నారు.పాఠశాల లోపలికి హద్దు మీరి ప్రవేశించినందుకు రూ.కోటి, తమ పాఠశాల సంఘం పేరుకు కళంకం కలిగించినందుకు రూ.5 కోట్లు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని, ఇతరులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించకుండా నిషేధాజ్ఞలు జారీ చేయాలనీ కోరారు.విచారణ జరపనున్నట్లు పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తి సీవీ.కార్తీకేయన్‌ తెలిపారు.

    English summary
    Aishwarya Dhanush, secretary of the Sri Raghavendra Educational Trust that runs the Ashram School, has sued landlord Venkateswarulu for defamation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X