బర్త్ డే పార్టీలో స్టార్ హీరోతో క్లోజ్‌గా.. వివాదాస్పద బిగ్ బాస్ భామకు లక్కీ ఛాన్స్!
తమిళ స్టార్ హీరో శింబుకు యువతలో మంచి క్రేజ్ ఉంది. శింబు చిత్రాలు యువతని టార్గెట్ చేసే విధంగా ఉంటాయి. అందుకే వరుస పరాజయాలు ఎదురైనా శింబు క్రేజ్ తగ్గలేదు. ఇటీవల శింబు మణిరత్నం నవాబ్ చిత్రంతో విజయం అందుకున్నాడు. ప్రస్తుతం ఈ రొమాంటిక్ హీరో తెలుగు సూపర్ హిట్ చిత్రం అత్తారింటికి దారేది రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబందించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

వివాదాల భామతో క్లోజ్‌గా
తమిళ బిగ్ బాస్ సీజన్ 2 లో ఐశ్వర్య దత్త చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ షోతో ఐశ్వర్య దత్తకు కాంట్రవర్షియల్ బ్యూటీ అని ట్యాగ్ తగిలించారు. ఇటీవల ఐశ్వర్య దత్త బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. ఈ పార్టీలో శింబు, ఐశ్వర్య దత్త చాలా క్లోజ్ గా కనిపించడం ఆసక్తిగా మారింది.

అత్తారింటికి దారేది రీమేక్
సుందర్ సి దర్శత్వంలో శింబు నటిస్తున్న అత్తారింటికి దారేది రిమేక్ లో ఐశ్వర్య దత్త కూడా నటిస్తోందనే ప్రచారం జరుగుతోంది. అందువలనే ఐశ్వర్య దత్త బర్త్ డే సెలెబ్రేషన్స్ కు శింబు కూడా హాజరయ్యాడని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

బిగ్ బాస్‌లో రన్నరప్
బిగ్ బాస్ షోలో ఐశ్వర్య దత్త రన్నరప్ తో సరిపెట్టుకుంది. అత్తారింటికి దారేది రీమేక్ లో నటించే అవకాశం హౌస్ లోపల ఉన్నప్పుడే వచ్చిందని అంటున్నారు. అప్పటినుంచే ఐశ్వర్య దత్త గాల్లో వివహరిస్తోందట.

భారీ సంస్థ నిర్మాణంలో
ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఏ చిత్రాన్ని శరవేంగా షూట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం తెలుగు సినిమా రికార్డులని తిరగరాసింది. తమిళంలో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











