డిమాండ్ చేస్తే ముద్దుకు ఓకే, స్టార్ కిడ్ ఐశ్వర్య (ఫోటోలు)
చెన్నై : ముద్దు సీన్లు ఇప్పటి సినిమాల్లో సర్వ సాధారణం అయిపోయాయి. ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్లు లిప్ లాక్ మద్దు సీన్లో పాల్గొన్నారంటే అదో సెన్సేషన్. కానీ హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల ప్రభావంతో దక్షిణాది సినిమాలకూ ఇది పాకింది. ఒకప్పుడు ముంబై నుంచి వచ్చిన హీరోయిన్లు మాత్రమే ఇలాంటి సీన్లు చేయడానికి సాహసించే వారు. వారి పోటీని తట్టుకోవడానికి ఇక్కడి హీరోయిన్లు ఇప్పుడు ముద్దు సీన్లు చేయడానికి సై అంటున్నారు.
మరోవైపు...కొత్తగా ఇండస్ట్రీలోకి ఎంటరవుతున్న స్టార్ కిడ్స్ ముద్దు సీన్ల విషయంలో చాలా ఓపెన్ గా ఉంటున్నారు. సినిమా వాతావరణంలో పెరగడమో, ఏమో తెలియదు కానీ ముద్దు సీన్లు, హాట్ సీన్ల పట్ల పాజిటివ్ ధోరణి ప్రదర్శిస్తున్నారు. కథ డిమాండ్ చేస్తే అలాంటి చేయడంలో తప్పేమీ లేదు, అది కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంలో భాగమే అంటున్నారు.
సౌతిండియా యాక్షన్ స్టార్ అర్జున్ కూతురు ఐశ్వర్య త్వరలో వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అవుతోంది. విశాల్ కృష్ణ హీరోగా భూపతిరాజా దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడుతూ...ముద్దు సీన్ల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన లేదని, సీన్ డిమాండ్ చేస్తే అలాంటి సీన్లు చేస్తాను అని స్పష్టం చేసింది.
ఆమె ప్రకటన కొందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే స్టార్ హీరో కూతురు అయి ఉండి బోల్డ్ సీన్లో నటించడానికి ఏమాత్రం సంకోచించని ఆమె తత్వం....సినిమాల పట్ల ఆమె పాషన్ ఏమిటో స్పష్టం అవుతుందని, అలాంటి పాజిటివ్ ధోరణి ఉన్నప్పుడే సినిమా రంగంలో నెగ్గుకు రాగలం అంటున్నారు విశ్లేషకులు.

ఇటీవల హీరోయిన్ రాధ కూతురు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి చిత్రంలో హీరో గౌతం కార్తీక్ తో కలిసి రొమాంటిక్ సీన్లలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు స్టార్ హీరో కూతురు ఐశ్వర్య కూడా ఇలాంటి సీన్లు చేయడానికి తాను సిద్దమే అని అంటోంది.

ఈ తరం హీరోయిన్లు పోటీని తట్టుకోవడానికి ఇలాంటి సీన్లు తప్పక చేయాల్సిన పరిస్థితి.

మరి స్టార్ హీరో కూతురిగి ఐశ్వర్య భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి

ఐశ్వర్య తొలి సినిమా హిట్టయతే తెలుగులోనూ ఆమె నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











