అందం-ఐశ్వర్యం-పట్టుదల: ఆమె సొంతం!
ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ఎంత అందగత్తో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు అందంతో పాటు కాస్త పట్టుదలా ఎక్కువే. ఆమె హిందీ, తమిళంలో నటిస్తున్నచిత్రం 'రావణ్" జూన్ 18న విడుదలకానుంది. ఐశ్వర్య రాయ్ 'ఇరువర్" తెలుగులో ఇద్దరు) అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో జీన్స్, 'కండుకొండైన్" చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం 'రోబో", 'రావణ్", నటిస్తోంది. 'ఫస్ట్ ఇంప్రషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రషన్" అన్నట్టు ఎంతైనా ఫస్ట్ మూవీ తమిళం కావడంతో ఆ భాషపై అభిమానం పెంచుకుంది కాబోలు. రావణ్ చిత్రానికి తానే డబ్బింగ్ చెప్పాలనుకుంది. అయితే దర్శకుడు మణిరత్నం..మాత్రం ప్రొఫెషనర్ తో డబ్బింగ్ చెప్పించాలనుకున్నారు. ఈ సినిమా మొదట డైలాగ్స్ అర్థమయ్యేలా చెప్పడానికి ఓ ట్యూటర్ ని కూడా పెట్టారు. సినిమా పూర్తయ్యేలోపు తమిళం చక్కగా అర్ధం చేసుకుంటోంది..మాట్లాడుతోంది..దీంతో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పింది.
ఈ సినిమా తర్వాత ఐశ్వర్య తమిళ అమ్మాయి కాదంటే ఆశ్చర్య పడతారట! అంత బాగా డబ్బింగ్ చెప్పిందంటున్నారు చిత్రవర్గాలు. ఏదేమైనా ఐశ్వర్యకు అందంతో పాటు పట్టుదల కూడా ఎక్కువే.


Click it and Unblock the Notifications











