రజనీకాంత్ గురించి మాట్లాడటం మరిచాను: ఐశ్వర్య రాయ్
ఐశ్వర్య రాయ్, రజనీకాంత్ కాంబినేషన్ లో రెడీ అయిన రోబో చిత్రం ఆడియో పంక్షన్ ఇటీవలే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో స్టేజీ ఎక్కిన ఐశ్వర్యారాయ్ హీరో రజనీకాంత్ గురించి అస్సలు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఆమె..రజనీతో తన ఎక్సపీరియన్స్ ఏమన్నా చెప్తుందా అని ఎదురుచూసిన వాళ్ళంతా నిరాసపడ్డారు. ప్రసంగం పూర్తయి యాంకర్‌కి మైక్ ఇచ్చేసి వేదికపై నుంచి దిగుతున్నప్పుడు ఐష్ ఆ విషయాన్ని గ్రహించారు. వేగంగా వేదిక మీదకొచ్చి "రజనీకాంత్ గురించి మాట్లాడటం మర్చిపోయాను. ఆయన కాంబినేషన్‌లో సినిమా చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది' అంది. ఆ మాటలు అనగానే ఆ ప్రాంగణం మరోసారి చప్పట్ల హోరుతో నిండిపోయింది. ఇక దర్శకుడు శంకర్ గురించి చెబుతూ..దర్శకుడు శంకర్‌కి అసాధ్యం అంటూ ఏదీ లేదని 'రోబో చిత్రం నిరూపించింది' అని ఉద్వేగంగా చెప్పిందామె. 'రోబో' ఆడియో. కౌలాలంపూర్‌లోని పుత్రజయ ఆడిటోరియంలో ఇటీవల ఈ వేడుక జరిగింది.


Click it and Unblock the Notifications











