twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విలన్ పాత్రలో ఐశ్వర్యరాయ్, భర్తగా మోహన్ బాబు? మణిర్నతం భారీ ప్లానింగ్!

    |

    ప్రముఖ దర్శకుడు మణిరత్నం తమిళ ఐకానిక్ రైటర్ కల్కి రాసిన 'పొన్నియిన్ సెల్వన్' నవల ఆధారంగా సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల క్రితమే మణిరత్నం.. విజయ్, మహేష్ బాబు ప్రధాన పాత్రల్లో ఈ సినిమా చేయాలని ప్లాన్ చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు.

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... 'పొన్నియిన్ సెల్వన్' ఆధారంగా తీసే సినిమా కోసం జయం రవి, విక్రమ్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, మోహన్ బాబు తదితరులతో మణిరత్నం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

    ప్రమాద కరమైన పాత్రలో ఐశ్వర్యరాయ్

    ప్రమాద కరమైన పాత్రలో ఐశ్వర్యరాయ్

    అరుల్ మోళి వర్మన్ అనే పాత్రకు జయం రవి, ఆదిత్య కరికాలన్ పాత్ర కోసం విక్రమ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్‌ని నందిని అనే పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. ‘పొన్నియిన్ సెల్వన్' నవలలో అత్యంత ప్రమాదకమైన పాత్ర నందిని కావడం గమనార్హం.

    భర్త పాత్రలో మోహన్ బాబు

    భర్త పాత్రలో మోహన్ బాబు

    నవలలో నంది పాత్ర అత్యంత విషపూరితమైన పాత్ర. పెరియా పళువెటరాయర్‌ను బలవంతంగా పెళ్లాడుతుంది. పెరియా పళువెటరాయర్‌ పాత్ర కోసం మోహన్ బాబుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

    అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో

    అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో

    అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటి వరకైతే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. భారీ తారాగణంతో పాటు భారీ బడ్జెట్‌తో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో ప్రధాన పాత్రధారులు ఫైనల్ అయిన తర్వాత ఈ మూవీ గురించి అఫీషియల్‌గా వెల్లడించే అవకాశం ఉంది.

    మణిరత్నం

    మణిరత్నం


    ఆ మధ్య వరుస ప్లాపులు ఎదుర్కొన్న మణిరత్నం గతేడాది విడుదలైన ‘చిక్క చివంత వానమ్' సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చారు. మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది.

     ‘పొన్నియిన్ సెల్వన్’

    ‘పొన్నియిన్ సెల్వన్’

    కాగా.. ‘పొన్నియిన్ సెల్వన్' నవల ఆధారంగా గతంలో ఎంజీఆర్, కమల్ హాసన్ లాంటి పెద్ద స్టార్ సినిమా చేయాలని ప్రయత్నాలు చేశారు. అయితే ఎందుకనో వారి ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. ‘పొన్నియిన్ సెల్వన్' అనేది అరుళ్‌ మోళి వర్మన్ కథ... అతడే గ్రేట్ కింగ్ రాజ రాజ ఛోళన్. కల్కి ఈ నవల రాయడానికి 3 సంవత్సరాల సమయం తీసుకున్నారు.

    English summary
    Mani Ratnam has been in the process of adapting Tamil iconic writer Kalki's Ponniyin Selvan. Speculations that Mani Ratnam is in talks with Jayam Ravi, Vikram, Amitabh Bachchan, Aishwarya Rai and Mohan Babu for the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X