నా ప్రియుడిని స్నేహితురాలే ఎగరేసుకుపోయింది.. రెండు సార్లు లవ్ ఫెయిల్యూర్!
తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా నటిస్తోంది. కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే కాక అన్ని రకాల పాత్రలు చేస్తూ నటిగా ఒక్కో మెట్టు ఎదుగుతోంది. సాధారణంగా హీరోయిన్లు చాలామంది వ్యక్తిగత జీవితాల గురించి బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ ఐశ్వర్య రాజేష్ మాత్రం తాను రెండు సార్లు లవ్ లో ఫెయిల్ అయ్యానని అంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ లోనే ప్రేమలో పడ్డట్లు చెప్పుకొచ్చింది.

ఇంటర్మీడియట్‌లోనే ప్రేమ
నటిగా సక్సెస్ అవుతున్నా, ప్రేమలో మాత్రం తాను పరాజయం చెందానని ఐశ్వర్య రాజేష్ అంటోంది. ఇంటర్మీడియట్ లో జరిగిన ప్రేమ కథ గురించి పూసగుచ్చినట్లు వివరించింది. ఓ అబ్బాయిని ప్రేమించా. మా ఇద్దరి మధ్య ఘాడమైన ప్రేమ వ్యవహారం సాగింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఊహించని షాక్ తగిలింది. నా తోనే ఉంటుంది నా స్నేహితురాలు నా ప్రియుడిని ఎగరేసుకుపోయి పెళ్లి చేసేసుకుంది. ప్రేమలో నా మొదటి పరాజయం ఇదే. స్నేహితురాలి చేతిలోనే మోసపోయా అని తెలిపింది.

రెండవసారి బ్రేకప్
కొన్ని రోజుల తర్వాత ఈ ఘటన నుంచి కోలుకుని మరో యువకుడి ప్రేమలో పడ్డా. కానీ విభేదాల కారణంగా కొంతకాలం తర్వాత విడిపోయాం. అప్పటి నుంచి తాను ప్రేమ జోలికి వెళ్లలేదని ఐశ్వర్య రాజేష్ అంటోంది. ఒక వ్యక్తికి మనసిచ్చి అతడినుంచి విడిపోయాక మరో వ్యక్తిని ప్రేమించడం నా వల్ల కాదు. చాలా మంది బ్రేకప్ ని చాలా సింపుల్ గా తీసుకుని మరొకరిని వెంటనే ప్రేమిస్తారు. కానీ నేను పాత జ్ఞాపకాలని అంత త్వరగా మరచిపోలేనని ఐశ్వర్య రాజేష్ అంటోంది.

అలాంటి వాళ్ళు నచ్చరు
తనకు పనిపాట లేకుండా తిరిగే కుర్రాళ్లంటే ఇష్టం ఉండదని ఐశ్వర్య రాజేష్ అంటోంది. ప్రేమించడం అనేది మంచి అనుభవం. కానీ ఒక నటిగా ఉంటూ ప్రేమించాలంటే అంత సులువైన విషయం కాదని ఐశ్వర్య రాజేష్ అంటోంది. ఇటీవల ఐశ్వర్య రాజేష్ కాలా, వాడ చెన్నై లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది.

విజయ్ దేవరకొండ సరసన
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత క్రాంతి మాధవ్ దర్శత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకు హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇప్పుడిపుడే ఐశ్వర్య రాజేష్ కు తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











