ఒక హీరో కూతురు డైరెక్షన్ లో మరో స్టార్ కూతురు హీరోయిన్..!?
హీరోల కూతుళ్ళంతా ఇప్పుడు హీరోయిన్లవుతుంటే... ఓ హీరోగారి కూతురు మాత్రం డైరెక్టర్ అవతారమెత్తుతోంది. తనే ఐశ్వర్య... సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు..! రజనీకాంత్ చిన్నమ్మాయి సౌందర్య నిర్మాతగా మారితే… పెద్దమ్మాయి ఐశ్వర్య డైరెక్టర్ గా అవతారమెత్తుతోంది. తన అభిరుచికనుగుణంగా త్వరలో దర్శకత్వం చేబడుతోంది. ఐశ్వర్య మొదటి నుంచీ డైరెక్షన్ శాఖ పట్ల మక్కువ పెంచుకుంది. అందుకు తగ్గట్టుగా స్టడీ చేసింది కూడా.
గతంలో కార్తీ హీరోగా శ్రీరాఘవ దర్శకత్వంలో రూపొందిన 'యుగానికి ఒక్కడు' చిత్రానికి ఐశ్వర్య డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసింది. ఇప్పుడిక సొంతంగా దర్శకత్వం వహించాలన్న కోరికతో అందుకు తగ్గా ప్లాన్ చేసుకుంటోందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ప్రస్తుతం రెడీ అవుతోందనీ, ఇది ప్రేమకథా చిత్రమనీ అంటున్నారు. ఇందులో ఐశ్వర్య భర్త ధనుష్ హీరోగా నటిస్తాడనీ, కమల్ కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుందనీ తెలుస్తోంది. తండ్రిలా కూతురు కూడా తన వృత్తిలో రాణించాలని ఆల్ ది బెస్ట్ చెబుదాం.


Click it and Unblock the Notifications











