దొంగతనంతో దొరికిపోయిన ఐశ్వర్య రజనీకాంత్.. పని మనిషి అసలు నిజం చెప్పడంతో.. ఆమె వల్లే!
సూపర్ స్టార్ రజనీ కాంత్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలిగా మంచి పేరు సంపాదించుకున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, శ్రుతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన త్రీ సినిమాకు ఆమె దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. కొట్టేసిన నగలుతో ఏకంగా ఇల్లు కట్టేసుకుంది ఆ ఇంటి పని మనిషి. అయితే తాజాగా ఐశ్వర్య రజనీకాంత్ పని మనిషి ఈశ్వరి పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడించింది. అవేంటో తెలుసుకుందామా!

చివరిసారిగా..
ఇటీవల ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో పెద్ద చోరీ జరిగింది. దీంతో పోలీసులను ఆశ్రయించిన ఐశ్వర్య రజనీకాంత్.. చెన్నైలోని తన ఇంట్లో దాచిన సుమారు 60 సవర్ల బంగారం, వజ్రాల నగలు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. అలాగే తన డైమండ్ సెట్ లు, టెంపులు జ్యూవెలరీ, నవరత్నాల సెట్లు, పాత బంగారం, గాజులు తదితర ఆభరణాల వివరాలు ఇచ్చారు ఐశ్వర్య. ఈ ఆభరణాలన్నింటిని తన ఇంటి లాకర్ లోనే పెట్టానని, చివరిసారిగా వాటిని 2019లో చూసినట్లు, తన సోదరి సౌందర్య పెళ్లి తర్వాత తిరిగి వాటిని ఆ లాకర్ లోనే పెట్టేసినట్లుగా ఐశ్వర్య రజనీకాంత్ వెల్లడించారు.

నిందితురాలిగా పనిమనిషి..
ఇక ఎవరి మీద అనుమానం ఉందా అని పోలీసులు అడిగిన ప్రశ్నకు తన ఇంట్లో పనిచేసే ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్ వెంకటేషన్ లపై డౌట్ ఉన్నట్లుగా చెప్పారు. తాను ఇంట్లో లేనప్పుడు వారు మాత్రమే తన ఇంటికి వచ్చేవారని, తాళాలు ఎక్కడ పెడతానో వారికి తెలుసుని ఆమె పేర్కొన్నారు. ఐశ్వర్య చెప్పిన వివరాలతో పోలీసులు సెక్షన్ 381 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితురాలిగా ఈశ్వరిని గుర్తించారు పోలీసులు.

ఐశ్వర్యపై ప్రశ్నల వర్షం..
ఈశ్వరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. తానే దొంగతనం చేసినట్లుగా ఒప్పుకుంది. ఈశ్వరిని విచారించిన తర్వాత ఆమె ఇంట్లో 100 సవర్ల నగలు, 4 కిలోల వెండి, 30 గ్రాముల వజ్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈశ్వరి ఇంట్లో ఐశ్వర్య చెప్పినదానికంటే ఎక్కువ నగలు ఉండటంతో పోలీసులకు అనుమానాలు తలెత్తాయి. దీంతో ఐశ్వర్యను కూడా పోలీసులు ప్రశ్నించారు.

చోరీ ఎందుకు చేసింది..
ఐశ్వర్య ఇంట్లోనే కాకుండా రజనీకాంత్, ధనుష్ ఇంట్లో కూడా ఈశ్వరి పని చేస్తున్నట్లుగా పోలీసులు తేల్చారు. దీన్ని బట్టి రజనీ కాంత్, ధనుష్ ఇంట్లో మిగిలిన నగలను పని మనిషి ఈశ్వరీ చోరీ చేసిందా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఐశ్వర్య ఇంట్లో ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న ఈశ్వరి అసలు దొంగతనం ఎందుకు చేసిందో కూడా పోలీసులకు తెలిపింది.

అప్పుడు దొరకలేదు..
ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో తాను గొడ్డుల పనిచేసినట్లు, ఆమె చెప్పిన పనులన్నీ చేసేదాన్నని పోలీసులకు తెలిపింది ఈశ్వరి. అయితే ఐశ్వర్య వద్ద చాలా డబ్బు ఉన్న తనకు మాత్రం రూ. 30 వేలు జీతం ఇచ్చేవారని వెల్లడించింది. "ఆ జీతం ఒక కుటుంబం బతకడానికి సరిపోతుందా. అందుకే దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాను. మొదట్లో చిన్న చిన్న వస్తువులను చోరీ చేశాను. కానీ నేను దొరకలేదు. దీంతో ధైర్యం చేసి నగలు కూడా కొట్టేశాను" అని ఈశ్వరి చెప్పుకొచ్చింది.

అందుకే దొంగతనం..
అంతేకాకుండా ఒకవేళ తాను దొరకకపోయి ఉంటే ఇంకా దొంగతనం చేసేదానినని, ఇప్పటికే రెండు అంతస్తుల ఇల్లు కూడా కొనుక్కున్నట్లు పోలీసుల విచారణలో పని మనిషి ఈశ్వరి చెప్పడం గమనార్హం. ఇలా ఐశ్వర్య రజనీకాంత్ ఇచ్చే జీతం సరిపోకపోవడం, ధనుష్, రజనీ కాంత్ ఇంట్లో కూడా గొడ్డు చాకిరి చేపించుకోవడంతోనే తను దొంగతనం చేసినట్లుగా ఈశ్వరి అసలు నిజం చెప్పింది. ఇలా పని మనిషి చేసిన దొంగతనంతో ఐశ్వర్య రజనీ కాంత్ దొరికిపోయినట్లయింది.


Click it and Unblock the Notifications











