అజంతా ఎల్లోర శిల్పాల్లోని శృంగార దేవతని: నమిత
నా అందాలు అజంతా, ఎల్లోరా శిల్పాల వంటివి అని చెప్పుకుంటున్న నమితకు తమిళ అభిమానులు గోపురంపై వుండే శిల్పంలా కాకుండా ఏకంతా గుడిలో వుండే దేవతగా భావించి గుడి కట్టారు. ఇంతకీ ఈ అమ్మడు ఏదేవత అనేగా, ఇంకా ఏ దేవత వుంటుంది శృంగార దేవత. తమిళ ప్రేక్షకులకు ఎవరి మీదైనా అభిమానం కలిగితే వెంటనే గుడి కట్టేస్తారని మనకు తెలిసిందే. ఆ అభిమానం కనుక ఉదృత రూపం దాల్చితే కట్టిన గుడిని కూల్చివేస్తారని కూడా తెలుసు. ఈ విషయాలు తెలుసుకున్న నమిత ఆ గుడి పై ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా గప్ చిప్ గా వుంటుంది. తనకు కట్టిన గుడిని ఒక్కసారి సందర్శించమని అడిగిన అభిమానులకు నేనేమన్నా దేవతనా చెప్పండి! అయినా మీ గుండెల్లో చోటు ఇచ్చారు. అదీ చాలు అంటూ సున్నితంగా వారిని పంపించేస్తుందట. నీ అందాలు నచ్చి గుడి కట్టించి దేవతలా నిన్ను చూసుకుంటున్న అభిమానులు అడిగితే తిరస్కరిస్తావా! ఒక్కసారి వెళ్లి చూడకూడదు అంటూ విమర్శకులు నమితకు సూచనలిస్తున్నారు.


Click it and Unblock the Notifications











