ఇండియన్2లో బాలీవుడ్ హీరో.. కమల్ ఆఫర్‌కు నయనతార గ్రీన్ సిగ్నల్

By Rajababu

తమిళ చిత్ర పరిశ్రమకు టాప్ బాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరు పరిచయం అవుతున్నారు. రోబో 2.0లో అక్షయ్ కుమార్, అజిత్ నటించిన వివేకం చిత్రంలో వివేక్ ఒబెరాయ్ లాంటి వాళ్లు ఇప్పటికే కోలీవుడ్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ తమిళ ప్రేక్షకులకు దగ్గర కాబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం కమల్ హాసన్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఇండియన్2 చిత్రంలో అజయ్ దేవగన్ నటిస్తున్నట్టు సమాచారం.

ఇండియన్2 చిత్రంలో కీలకపాత్రను కమల్ ఆఫర్ చేశారు. కమల్ లాంటి నటుడు నాకు ఆఫర్ ఇవ్వడమే గొప్ప అదృష్టం. దర్శకుడిగా కీలక పాత్రకు నన్ను ఎంచుకోవడం చాలా ఆనందం కలిగింది అని అజయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Ajay Devgn in Kamal Haasans Indian2

తమిళంలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌కు కమల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసింది. ఆ షో పూర్తయిన తర్వాత ఇండియన్2 సినిమాను సెట్స్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో శంకర్ రూపొందించే చిత్రానికి లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలను చేపట్టింది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందించే ఈ చిత్రంలో కమల్ సరసన నటించేందుకు నయనతారను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇక కమల్ నటించిన విశ్వరూపం2 చిత్రం ఆగస్టు 10న రిలీజ్ కానున్నది.

Ajay Devgn in Kamal Haasans Indian2

ఇండియన్2 చిత్రం కోసం అజయ్ దేవగన్ తన బిజీ షెడ్యూల్‌ను సవరించుకొంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఓ రొమాంటిక్, కామెడీ చిత్రలో అజయ్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, టబు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రం ద్వారా ఎడిటర్ అకివ్ అలీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రం తర్వాత అజయ్ టోటల్ ధమాల్ అనే సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రంలో అనిల్ కపూర్, మాధురి దీక్షిత్, అర్షద్ వార్సీ, రితేష్ దేశ్‌ముఖ్, జావేద్ జాఫ్రీ నటిస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టులతో బిజీగా మారిన అజయ్.. ఇండియన్2 కోసం డేట్స్ ఇవ్వడం ఫ్యాన్స్‌కు ఆనందం కలిగిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X