అజిత్ ‘డేవిడ్ బిల్లా’స్టోరీ లైన్ ఏంటి?
అజిత్ తాజా చిత్రం 'డేవిడ్ బిల్లా' త్వరలో తెలుగులోకి విడుదల కానున్న సంగతి తెలిసిందే. అజిత్‌ని స్టయిలిష్‌గా ఆవిష్కరించిన చిత్రం 'బిల్లా' చిత్రానికి ప్రీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం కథ ఎలా ఉండబోతోందనేది అంతటా హాట్ గా మారింది. అందులోనూ ఈ చిత్రం సీక్వెల్ కాకుండా బిల్లాకు ప్రీక్వెల్ కావటంతో మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఈ చిత్రం కథ...బిల్లా మాఫియా లీడర్ అవ్వకముందు ఏం చేసేవాడు? అతను మాఫియాలోకి ఎంటరవ్వడానికి కారణం ఏంటి? అసలు బిల్లాగా అతను ఎలా రూపొందాడు. అంత పరవ్ శక్తిగా ఎలా మారి ప్రపంచానికి సవాళ్లు విసిరాడు...వంటి అనేక విషయాలు ఈ చిత్రంలో చర్చకు రానున్నాయి. ఇవన్నీ ఫ్లాష్‌బ్యాక్ లో రానుందని తెలుస్తోంది.
ఇక 'డేవిడ్ బిల్లా' చిత్రం తెలుగు విడుదల హక్కులను ఎస్వీఆర్ మీడియా అధినేత శోభారాణి చేజిక్కించుకున్నారు. ఈ సినిమా గురించి శోభారాణి చెబుతూ ...అజిత్ కెరియర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో అజిత్ రిస్కీ ఫైట్లు చేశారు. ఈ ఫైట్స్ ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటాయి. 'బిల్లా'లో అజిత్ స్టయిలిష్‌గా కనిపించారు. ఈ చిత్రంలో ఆయన మరింత స్టయిలిష్‌గా కనిపిస్తారు. ఈ చిత్రం కోసం ఉక్రెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు అన్నారు.
అలాగే ఉక్రెయిన్ లో మామూలుగా షూటింగ్స్‌కి అక్కడ అనుమతి ఇవ్వరని,అయినా అక్కడ పర్మిషన్ సంపాదించి..అలాంటి ప్రదేశాల్లో సైతం ఈ చిత్రం షూటింగ్ జరిపారని చెప్పారు. ఈ క్రేజీ చిత్రం హక్కులను చేజిక్కించుకోవడానికి పలువురు నిర్మాతలు పోటీపడ్డారు. చివరికి మా సంస్థకే దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 10న పాటలను విడుదల చేస్తాం. యువన్‌శంకర్‌రాజా మంచి స్వరాలిచ్చారు. ఈ పాటలు, సినిమా ఘనవిజయం సాధిస్తాయన్న నమ్మకం ఉంది అని చెప్పారు. చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పార్వతి ఓమన్‌కుట్టన్, బ్రూనా అబ్దుల్లా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
తమళంలో వచ్చిన 'బిల్లా'చిత్రాన్ని ఆ మధ్యన ప్రభాస్ తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే అజిత్ తో 'బిల్లా-2'చిత్రాన్ని రెడీ చేసారు. బిల్లాకు ప్రీక్వెల్ గా రెడీ అయిన ఈ చిత్రాన్ని మాత్రం రీమేక్ రైట్స్ ఇవ్వకుండా డబ్బింగ్ చేస్తున్నారు. వారు తమ ఒరిజనల్ వర్క్ ని తెలుగు ప్రేక్షకులకు చూపించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ఓ పెద్ద నిర్మాత బిల్లా 2 రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
మరో ప్రక్క అజిత్ నటించిన 'గ్యాంబ్లర్' చిత్రం ఇటీవల తెలుగులో అనువాదమైనా పెద్దగా వర్కవుట్ కాలేదు. అయినా ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నారు. ఇక ఆ మధ్య కమలహాసన్, వెంకటేష్‌లు నటించిన 'ఈనాడు' చిత్రానికి దర్శకత్వం వహించిన చక్రి తోలేటి ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్ సరసన పార్వతి ఓమనకుట్టన్, బ్రునా అబ్దుల్లా నాయికలుగా నటిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. వేసవి సందర్భంగా త్వరలో సినిమాను విడుదల చేస్తారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











