అజిత్ రూ. 100 కోట్ల డీల్.. బాలీవుడ్లో రీలాంచ్ కాబోతున్నాడా?

అజిత్ హీరోగా 'నెర్కొండ పార్వాయ్' అనే సినిమా తెరకెక్కించడం ద్వారా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే అజిత్‌తో కేవలం ఒకే సినిమాకు పరిమితం కాకుండా మొత్తం 3 చిత్రాలు చేయాలని బోనీ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం... బోనీ-అజిత్ మధ్య 3 సినిమాలకు డీల్ కుదిరినట్లు సమాచారం. ఈ మూడు ప్రాజెక్టులకుగాను రూ.100 కోట్ల రూపాయలు అజిత్‌కు చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం మూడు సినిమాల విడుదల సమయంలో విడుతల వారీగా చెల్లిస్తారట.

Ajith and Boney Kapoor Rs 100 cr deal hot topic

వీరి కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రం 'నెర్కొండ పార్వాయ్'... ఆగస్ట్ 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హిందీ మూవీ 'పింక్' చిత్రానికి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే. తమిళ వెర్షన్‌కు హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా... విద్యా బాలన్, శ్రద్ధా శ్రీనాథ్, అభిరామి వెంకటాచలం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ మూడు చిత్రాల్లో భాగంగా ఒకటి బాలీవుడ్ మూవీ కూడా ఉంటుందని, ఈ మూవీ ద్వారా అజిత్‌ను హిందీలో రీలాంచ్ చేయబోతున్నట్లు టాక్. 'నెర్కొండ పార్వాయ్ మూవీ రషెస్ చాలా బాగున్నాయి. అజిత్ అద్భుతంగా నటించారు. అతడు తర్వలో హిందీ సినిమా చేయడానికి అంగీకరిస్తారు అనుకుంటున్నాను. మా వద్ద 3 యాక్షన్ స్క్రిప్టులు ఉన్నాయి. అందులో ఒకదానికి ఆయన ఓకే చెబుతారని అనుకుంటున్నాను. ' అని బోనీ కపూర్ ఆ మధ్య ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X