మణిరత్నంతో 'భారతీయుడు-2'
కమల్ హాసన్ హీరోగా గతంలో తాను రూపొందించిన 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ తీయనున్నట్టు తమిళ దర్శకుడు శంకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా చిత్రంలో కమల్ నటించటం లేదు. ఆ చిత్రంలో హీరోగా అజిత్ ని ఎంపిక చేసారు. తాజాగా మంగత్తా చిత్రంతో ఓ రేంజి విజయం సాధించిన అజిత్ ఈ చిత్రం స్టోరీ లైన్ విని వెంటనే ఓకే చేసారు. అలాగే ఈ చిత్రాన్ని మరో దర్శకుడు మణిరత్నం నిర్మించనుండగా, ఎ.ఆర్.రహమాన్ సంగీతాన్ని అందించనున్నారు. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2012లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ఇక దేశంలో పెరిగిపోతున్న అవినీతి ప్రధానాంశంగా, కమల్ హసన్ నటించిన 'భారతీయుడు' చిత్రం 1996లో విడుదలై సంచలన విజయం సాధించింది. తమిళంలో 'ఇండియన్'గా రూపొంది, తెలుగులో 'భారతీయుడు'గా, హిందీలో 'హిందుస్థానీ'గా అనువాదమైన ఈ సినిమా మూడు జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులతోసహా దేశీయంగా పలు పురస్కారాలు అందుకోవడమేకాక, ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో భారత్‌నుంచి ఆస్కార్ అవార్డ్‌కు కూడా నామినేట్ అయింది. ఇక ప్రస్తుతం శంకర్.. త్రీ ఇడియట్స్ రీమేక్ లో బిజీగా ఉన్నారు.
హిందీలో ఘనవిజయం సాధించిన 'త్రీ ఇడియట్స్" చిత్రం కావటం, శంకర్ దర్సకత్వం లో సినిమా రావటంతో మంచి క్రేజ్ వస్తోంది. అమీర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి నటించిన ఈ చిత్రం రైట్స్ ని జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ సొంతం చేసుకుని నిర్మిస్తున్నారు. ఇక తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్న ఈ చిత్రంలో అమీర్‌ఖాన్ పాత్రకు విజయ్‌ను, ఇతర రెండు పాత్రలకు జీవా, శ్రీరామ్‌లను చేస్తున్నారు. మరో కీలక పాత్రలో సత్యరాజ్ నటిస్తున్నారు. హీరోయిన్‌గా ఇలియానా అదరకొట్టనుంది.


Click it and Unblock the Notifications











