బిల్లాకు సీక్వెల్‌గా బిల్లా -2 షూటింగ్ శరవేగంగా

By Sindhu

బిల్లా -2 చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మంగాత్తా తర్వాత అజిత్ నటిస్తున్న చిత్రం బిల్లా-2. గతంలో వచ్చిన బిల్లాకు సీక్వెల్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఉన్నైపోల్ ఒరువన్ ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్‌ కు జంటగా ముంబయి మోడల్ హియుమా కురేచీ నటిస్తున్నారు. ముఖ్య పాత్రల్లో బాలీవుడ్ నటుడు సుధన్సు పాండే, ప్రుణా అబ్దుల్లా, మలయాళ నటుడు మనోజ్ కె జయన్ నటిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. గోవా, తూత్తుకుడి తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కీలక సన్నివేశాలను, పాటలను రష్యాలో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. మంగాత్తా చిత్రం ఈ నెలాఖరున విడుదలకు సిద్ధమవుతోంది. బిల్లా-2ను దీపావళికి విడుదల చేయాలని హీరో అజిత్ భావిస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X