భార్యతో కలిసి,క్యూలో నిలబడి ఓటేసిన స్టార్ హీరో (వీడియో)

By Srikanya

చెన్నై: ఇది ఎలక్షన్ సీజన్. అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. స్టార్స్ సైతం తమ సమయాన్ని కొంత కేటాయించి ఓటేయటానికి ముందుకు వెళ్తున్నారు. తమిళ స్టార్ హీరో అజిత్ తన భార్య షాలినీతో కలిసి చెన్నైలో వెళ్లి ఓటేసారు. మిగతా ఓటర్లతో పాటే ఆయన లైన్ లో నిలబడి ఓటేయటం చాలా మందిని ఆకర్షించింది. అలాగే ఆయన అభిమానులకు ఓ సందేశం పంపినట్లేంది. మీరు ఈ వీడియో చూడాలంటే క్రింద ఉంది చూడవచ్చు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/jZiDyOZSOZQ?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

తాజాగా అజిత్ చిత్రానికి 'వెయ్యి బుల్లెట్లు' ('ఆయిరం తోట్టాక్కల్‌') అనే టైటిల్ పెట్టారని సమాచారం. అనుష్క హీరోయిన్ కావటం, ఈ టైటిల్ సినిమాకు ఎక్కడలేని మాస్ ఇమేజ్,గ్లామర్ వచ్చేసిందని సినీ వర్గాలు అంటున్నాయి.

'వెయ్యి బుల్లెట్లు' ('ఆయిరం తోట్టాక్కల్‌') అజిత్‌ కొత్త చిత్రం పేరు ఇదేనని అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. తన చిత్రాలతో నిత్యం వార్తల్లో నిలిచే హీరో అజిత్‌. 'ఆరంభం', 'వీరం' వంటి వరుస హిట్లతో ఆయన స్థాయి మరింత పెరిగింది. దీనికి తోడు గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో తొలిసారిగా నటించనుండటంతో కోలీవుడ్‌లోనే ఈ కొత్త ప్రాజెక్టుపై అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 9న ప్రారంభోత్సవం కూడా జరుపుకుందీ చిత్రం.

అజిత్‌కు జంటగా.. అనుష్క, ఎమీ జాక్సన్‌ ఆడిపాడనున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి 'ఆయిరం తోట్టాక్కల్‌' (వేయి తూటాలు) అనే పేరును నిర్ణయించినట్లు సమాచారం. స్టెలీష్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి ఆ పేరు తగినదని చిత్ర యూనిట్‌ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ టైటిల్ తో ఒక్కసారిగా ప్రాజెక్టుపై అంచనాలు పెరిగిపోయినట్లు చెప్తున్నారు.

తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గౌతమ్‌ మీనన్‌ ఇందులో అజిత్‌ను సరికొత్త గెటప్‌లో చూపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా అజిత్‌ హెయిర్‌స్టెల్‌ వినూత్నంగా ఉండనుందని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

స్త్టెలిష్‌ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ అజిత్‌ చిత్రం ద్వారా ఈ మధ్యలో దూరమైన తన ఆస్థాన సంగీత దర్శకుడితో మళ్లీ చేయి కలిపాడు. ప్రేమకథ, ఎన్‌కౌంటర్‌ తరహా చిత్రాల ద్వారా దర్శకుడిగా తనకంటూ ఓ పంథాను సృష్టించుకున్న దర్శకుడు గౌతమ్‌మీనన్‌. తన తొలి చిత్రం మిన్నలే నుంచి కాక్కకాక్క, వేట్టయాడు విలైయాడు, వారనం ఆయురం అంటూ అన్ని చిత్రాలకు సంగీత బాధ్యతను హరీష్‌ జైరాజ్‌కే అప్పగించారు. ఆయన కూడా అంతే అద్భుతమైన సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించాడు.

అయితే అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవటంతో గౌతమ్‌ మీనన్‌ ఇతరుల వైపు దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆయన రూపొందించిన 'విన్నైతాండి వరువాయా'కు ఏఆర్‌ రెహమన్‌, 'నీదానే ఎన్‌ పొన్‌ వసంతం'కు ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. ఈ నేపథ్యంలో గౌతమ్‌ మీనన్‌తో హరీష్‌ మళ్లీ కలిసి పని చేయనున్నాడు., అజిత్‌ హీరోగా గౌతమ్‌ నిర్మించనున్న ఓ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అజిత్‌తో తనకు ఇదే తొలి చిత్రం కావటంతో అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట గౌతమ్‌ మీనన్‌. ఇందులో భాగంగా గతంలో తనకు ఎన్నో సూపర్‌హిట్‌ పాటలను అందించిన హరీష్‌ జైరాజ్‌ వైపే మొగ్గు చూపాడట.

నాగచైతన్యకి 'ఏ మాయ చేశావె" చిత్రంతో హిట్ ఇచ్చి కెరీర్ ఇచ్చిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చిత్రం అంటే హీరోలందరికీ ఆసక్తే. అయితే రీసెంట్ గా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూర్యతో అనుకున్న చిత్రం ఆగిపోయింది. కథ కుదరలేదని మరీ సూర్య ఆ ప్రాజెక్టు ఆపుచేసి,మరో సినిమా ప్రారంభించేసాడు. అంతకుముందు విజయ్ సైతం గౌతమ్ మీనన్ కి హ్యాండ్ ఇచ్చాడు. అయితే గౌతమ్ మీనన్ మాత్రం సూపర్ స్టార్ హీరోతో జత కట్టేందుకు సిద్దమవుతున్నారు. ఆ స్టార్ హీరోనే అజిత్. అజిత్ ఇప్పుడు తమిళనాడులో ఓ రేంజిలో క్రేజ్ ఉంది. ఆయన గౌతమ్ మీనన్ ని పిలిచి మరీ ప్రాజెక్టు అప్పచెప్పినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X