రజనీ ఫ్యాన్ పనేనా? వదంతులను నమ్మెద్దు.. అవన్నీ ఊహాగానాలే.. అజిత్ ఎమోషనల్.!

Recommended Video

Ajith Declares About His Entry Into Politics | Filmibeat Telugu

తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్ వరుస విజయాలతో, రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను కేక పెట్టిస్తున్నారు. ఆయన నటించిన విశ్వాసం ఇటీవలే రిలీజై రూ.200 కోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరబోతున్నది. విశ్వాసం మూవీకి బ్రహ్మండమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి వస్తున్నది. ఇలా సక్సెస్‌తో హంగామా చేస్తున్న అజిత్‌పై తమిళనాడులో అనేక రూమర్లు వస్తున్నాయి. రజనీకాంత్ ఫ్యాన్స్ అజిత్ అభిమానుల మధ్య ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఇటీవల గొడవలు కూడా జరిగాయి. ఆ రూమర్ల గురించి ఎమోషనల్‌గా అజిత్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

పాలిటిక్స్‌లోకి అజిత్ కుమార్

పాలిటిక్స్‌లోకి అజిత్ కుమార్

తమిళ సినీ రంగం నుంచి రాజకీయ రంగంపైకి అజిత్ దృష్టిపెట్టాలనుకొంటున్నారు. త్వరలోనే అజిత్ పాలిటిక్స్‌లో చేరుబోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఇలాంటి వార్తలు రావడంతో రాజకీయాల్లో విపరీతమైన చర్చకు దారి తీసింది. అభిమానుల్లో ఆనందం, రాజకీయ వర్గాల్లో కలవరం కనిపించింది.

హీరో అజిత్‌పై అభిమానుల ఒత్తిడి

హీరో అజిత్‌పై అభిమానుల ఒత్తిడి

అజిత్‌ పాలిటిక్స్‌లో వస్తున్నారనే వార్తలు గుప్పుమనే సరికి ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు. దాంతో హీరోపై ఒత్తిడి పెరగడంతో అజిత్ తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. తాను స్పందించకపోతే చర్చ మరోదారి పట్టే అవకాశం ఉందని పాలిటిక్స్ ఎంట్రీపై క్లారిటీ ఇస్తూ అజిత్ ఓ ప్రకటన విడుదల చేశాడు.

ఊహాగానాలను పట్టించుకోవద్దు

ఊహాగానాలను పట్టించుకోవద్దు

రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు. అలాంటి ఉద్దేశాలు కూడా నాకు లేవు. రాబోయే సినిమాలపైనే నేను ఫోకస్ పెట్టాను. అలాగే అభిమానుల కూడా వారి దినచర్య, కుటుంబాలపై దృష్టిపెట్టాలని, ఇలాంటి ఊహాగానాలను పట్టించుకోవద్దు అని అజిత్ పేర్కొన్నారు.

రూమర్లు క్రియేట్ చేయద్దని

రూమర్లు క్రియేట్ చేయద్దని

అభిమానులు కూడా ఇలాంటి వార్తలకు ప్రోత్సాహం ఇవ్వవద్దు. నా కెరీర్ గురించి కూడా రూమర్లు క్రియేట్ చేయవద్దు. ఇలాంటి పనికిరాని విషయాలను పక్కన పెట్టి సమాజానికి మేలు చేసే పనులు చేయండి అని అజిత్ సూచించారు. దీంతో రూమర్లను నేరుగా ఖండించి ఊహాగానాలకు తెరదించారు.

రాజకీయాల్లోకి అజిత్ కుమార్ అని

రాజకీయాల్లోకి అజిత్ కుమార్ అని

మాజీ ముఖ్యమంత్రి జయలలిత కు అజిత్ సన్నిహితుడు. ఆమె మరణం తర్వాత తమిళ రాజకీయాల్లోకి అజిత్ ప్రవేశిస్తున్నట్టు ఇటీవల రూమర్లు ఎక్కువనే వినిపించడంతో అజిత్ ఇలా నేరుగా స్పందించాల్సి వచ్చింది. ఇక మీడియాకు, ఫ్యాన్స్ ‌కూడా అనేక అనుమానాలు తొలిగిపోయాయనే మాట వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X