twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇద్దరి హీరోలు పొమ్మన్నా సూపర్ స్టార్ నే పట్టేసాడు

    By Srikanya
    |

    Gautham Menon
    చెన్నై : నాగచైతన్యకి 'ఏ మాయ చేశావె" చిత్రంతో హిట్ ఇచ్చి కెరీర్ ఇచ్చిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చిత్రం అంటే హీరోలందరికీ ఆసక్తే. అయితే రీసెంట్ గా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూర్యతో అనుకున్న చిత్రం ఆగిపోయింది. కథ కుదరలేదని మరీ సూర్య ఆ ప్రాజెక్టు ఆపుచేసి,మరో సినిమా ప్రారంభించేసాడు. అంతకుముందు విజయ్ సైతం గౌతమ్ మీనన్ కి హ్యాండ్ ఇచ్చాడు. అయితే గౌతమ్ మీనన్ మాత్రం సూపర్ స్టార్ హీరోతో జత కట్టేందుకు సిద్దమవుతున్నారు. ఆ స్టార్ హీరోనే అజిత్. అజిత్ ఇప్పుడు తమిళనాడులో ఓ రేంజిలో క్రేజ్ ఉంది. ఆయన గౌతమ్ మీనన్ ని పిలిచి మరీ ప్రాజెక్టు అప్పచెప్పినట్లు సమాచారం. ఈ మేరకు నిర్మాతలు ప్రెస్ నోట్ విడుదల చేసి ఖరారు చేసారు.

    వరుస చిత్రాలతో అజిత్‌ వేగాన్ని పెంచుతున్నారు. ఆయన నటించిన 'ఆరంభం' చిత్రం దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది. శివ దర్శకత్వంలో 'వీరం'లో నటిస్తూ మరోవైపు ఆయన బిజీగా ఉన్నారు. తాజాగా మరో చిత్రానికి సంతకాలు చేశారు. ఈ సినిమాకు స్టెలిష్‌ దర్శకుడు గౌతంమీనన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఎం రత్నం నిర్మాత. మాస్‌స్టెలిష్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలలో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి.

    'ఆరంభం' విషయానికి వస్తే గతంలో వచ్చిన 'బిల్లా'ను మించిన వేగంతో ఉంటుందని దర్శకుడు విష్ణువర్ధన్‌ పేర్కొంటున్నాడు. అజిత్‌కు జంటగా నయనతార నటిస్తుండగా, మరో జంటగా ఆర్య-తాప్సీ కనిపించనున్నారు. ఈ చిత్రం ఖచ్చితంగా అజిత్ కెరీర్ లో పెద్ద హిట్ నమోదు చేస్తుందని హామీ ఇస్తున్నాడు. విష్ణువర్ధన్‌ మాట్లాడుతూ.. 'బిల్లా'లాంటి మెగాహిట్‌ తర్వాత అజిత్‌తో మరోసారి పని చేయటం ఆనందంగా ఉంది. 'మంగాత్తా'లో సగానికి పైగా నెరసిన వెంట్రుకలతో కనిపించిన అజిత్‌ ఇందులోనూ అదే గెటప్‌లో అలరించనున్నాడు. అలా చూపాలని మా యూనిట్‌ ముందుగానే అనుకుంది. వెంకట్‌ ప్రభు మాకన్నా వేగంగా స్పందించి 'మంగాత్తా'లో ఆ క్రెడిట్‌ కొట్టేశాడు.

    'ఆరంభం' ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. స్క్రీన్‌ప్లేలో 'బిల్లా'ను మించే వేగం ఉంటుంది. తమిళ ప్రేక్షకులందరికీ నచ్చేలా ఉంటుందని వివరించాడు. కథ గురించి ప్రస్తుతానికి ఏమీ చెప్పలేం. ఇంకా చాలా పనులున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. ప్రతి ఫ్రేమూ ఎంతో కష్టపడి చిత్రీకరించాం. కేవలం అజిత్‌ అభిమానులకే కాదు.. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని చెప్పగలను. అజిత్‌కు తగ్గట్టు పలు పంచ్‌ డైలాగులున్నాయి. 'తుప్పాక్కి వైతిరుక్కురవన్‌ పేసమాట్టాన్‌'.. (తుపాకి ఉన్నవాడు పెద్దగా మాట్లాడడు) వంటి సంభాషణలు థియేటర్‌లో పేలడం ఖాయం. అజిత్‌, ఆర్య కలయిక అనుకున్నట్టే క్లిక్‌ అయింది. ఇక ప్రేక్షకుల ముందు తెరపై పండటమే మిగిలి ఉంది. ఆ విషయాన్ని త్వరలో మీరే చూస్తారుగా అని ముగించారు.

    English summary
    While there buzz regarding Ajith's next flick after Veeram, it has now been confirmed that Ajith would be joining hands with acclaimed director Gautham Menon for a mass stylish entertainer under Sri Satya movies banner. Confirming the association, the producers issued a press statement that film will kick start in 2014. The statement further said that Ajith Kumar will sport an unseen look in the movie that will have all of us in awe and as the Director Gautham Menon quotes this "will be a mass stylish entertainment fest".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X