Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇద్దరి హీరోలు పొమ్మన్నా సూపర్ స్టార్ నే పట్టేసాడు
వరుస చిత్రాలతో అజిత్ వేగాన్ని పెంచుతున్నారు. ఆయన నటించిన 'ఆరంభం' చిత్రం దీపావళి సందర్భంగా తెరపైకి రానుంది. శివ దర్శకత్వంలో 'వీరం'లో నటిస్తూ మరోవైపు ఆయన బిజీగా ఉన్నారు. తాజాగా మరో చిత్రానికి సంతకాలు చేశారు. ఈ సినిమాకు స్టెలిష్ దర్శకుడు గౌతంమీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఎం రత్నం నిర్మాత. మాస్స్టెలిష్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలలో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
'ఆరంభం' విషయానికి వస్తే గతంలో వచ్చిన 'బిల్లా'ను మించిన వేగంతో ఉంటుందని దర్శకుడు విష్ణువర్ధన్ పేర్కొంటున్నాడు. అజిత్‌కు జంటగా నయనతార నటిస్తుండగా, మరో జంటగా ఆర్య-తాప్సీ కనిపించనున్నారు. ఈ చిత్రం ఖచ్చితంగా అజిత్ కెరీర్ లో పెద్ద హిట్ నమోదు చేస్తుందని హామీ ఇస్తున్నాడు. విష్ణువర్ధన్ మాట్లాడుతూ.. 'బిల్లా'లాంటి మెగాహిట్ తర్వాత అజిత్‌తో మరోసారి పని చేయటం ఆనందంగా ఉంది. 'మంగాత్తా'లో సగానికి పైగా నెరసిన వెంట్రుకలతో కనిపించిన అజిత్ ఇందులోనూ అదే గెటప్‌లో అలరించనున్నాడు. అలా చూపాలని మా యూనిట్ ముందుగానే అనుకుంది. వెంకట్ ప్రభు మాకన్నా వేగంగా స్పందించి 'మంగాత్తా'లో ఆ క్రెడిట్ కొట్టేశాడు.
'ఆరంభం' ఓ యాక్షన్ ఎంటర్టైనర్. స్క్రీన్‌ప్లేలో 'బిల్లా'ను మించే వేగం ఉంటుంది. తమిళ ప్రేక్షకులందరికీ నచ్చేలా ఉంటుందని వివరించాడు. కథ గురించి ప్రస్తుతానికి ఏమీ చెప్పలేం. ఇంకా చాలా పనులున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. ప్రతి ఫ్రేమూ ఎంతో కష్టపడి చిత్రీకరించాం. కేవలం అజిత్ అభిమానులకే కాదు.. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని చెప్పగలను. అజిత్‌కు తగ్గట్టు పలు పంచ్ డైలాగులున్నాయి. 'తుప్పాక్కి వైతిరుక్కురవన్ పేసమాట్టాన్'.. (తుపాకి ఉన్నవాడు పెద్దగా మాట్లాడడు) వంటి సంభాషణలు థియేటర్లో పేలడం ఖాయం. అజిత్, ఆర్య కలయిక అనుకున్నట్టే క్లిక్ అయింది. ఇక ప్రేక్షకుల ముందు తెరపై పండటమే మిగిలి ఉంది. ఆ విషయాన్ని త్వరలో మీరే చూస్తారుగా అని ముగించారు.