'దూకుడు' మీద కన్నేసిన స్టార్ తమిళ హీరో
మహేష్ బాబు తాజా చిత్రం 'దూకుడు' పై తమిళ స్టార్ హీరో అజిత్ కన్నేసారు. ఆయన ఈ చిత్రం రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఆయన రేపటి రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే కొందరు తమిళ నిర్మాతలు చిత్రం రీమేక్ రైట్స్ కోసం ఎంక్వైరీ చేస్తే దూకుడు నిర్మాతలు రిలీజ్ అయ్యాక చూద్దాం అని ప్రక్కన పెట్టారు. ఇక తమిళంలో ఓకే అయితే జయం రాజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపిందించాలని అజిత్ ప్లాన్ చేస్తున్నారు. జయం రాజా అక్కడ రీమేక్ ల స్పెషలిస్టు గా పేరు గాంచాడు. ఇక రెగ్యులర్ గా మహేష్ రీమేక్ లను చేసే విజయ్ మాత్రం ఈ సారి పెద్దగా ఆసక్తి చూపటం లేదు.గతంలోనూ అతడు సినిమాని తమిళంలో రీమేక్ చేద్దామని అజిత్ ఆశించాడు కానీ జరగలేదు.
అతడుని తమిళంలోకి డబ్ చేసి వదిలారు. మరో ప్రక్క తమిళంలోనూ దూకుడు ఎక్కువ ప్రింట్స్ తో విడుదల చేయటం కూడా అక్కడ రీమేక్ కు ప్రతిబంధకంగా భావిస్తున్నారు. ఈ చిత్రంకి సెన్సార్ U/A సర్టిఫికేట్ తో క్లియరెన్స్ ఇచ్చింది. అలాగే దూకుడు హైదరాబాద్ లో డబ్బై స్క్రీన్స్ లో విడుదల అవుతోంది. అలాగే చెన్నై సిటీలోనూ 17 స్క్రీన్స్ లో విడుదల అవుతోంది. ఇప్పటివరకూ ఇన్ని స్క్రీన్స్ లతో ఏ తెలుగు సినిమా విడుదల కాలేదు. ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











