సినిమా రిలీజ్ వేళ అభిమానుల దౌర్జన్యం... అరెస్ట్ చేసిన పోలీసులు!
సంక్రాంతి సందర్భంగా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో పలువురు స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే సంతోషంగా పండగ సినిమాలను ఎంజాయ్ చేయాల్సిన సమయంలో హీరో అజిత్ అభిమానులు తమిళనాడులో దౌర్జన్యానికి పాల్పడి అరెస్ట్ అయ్యారు.
అజిత్ నటించిన 'విశ్వాసం' చిత్రం జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు పలు చోట్ల అజత్ భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ కటౌట్స్ వివాదం చివరకు అభిమానుల అరెస్టుకు దారి తీసింది.

అజిత్ అభిమానుల బెదిరింపులు
తమిళనాడులోని జిల్లాలోని తేని జిల్లాలోని ఓ గ్రామంలో అజిత్ అభిమానులు ఒక ఇంటి ముందు భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు. అయితే ఆ కటౌట్ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో అభిమానులు ఆ ఇంటి యజమాని జయమణిపై దూషణకు దిగారు. అతడిని బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు.

అరెస్ట్ చేసిన పోలీసులు
యజమణి ఈ విషయమై లోకల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు బాల మురుగన్, అజిత్ కుమార్, సతీశ్వరణ్, విజయ్, సెల్వకుమార్‌తో పాటు మరో ఐదుగురిని కస్టడీలోకి తీసుకున్నారు. చంపుతాని బెదిరించడం, అసభ్యపదజాలంతో దూషించిన ఆరోపణలతో కేసు నమోదు చేశారు.

షూటింగ్ జరిగిన గ్రామంలోనే గొడవ
ఈ వివాదం తమిళనాడులోని తేని జిల్లా కోడువిలర్పట్ అనే గ్రామంలో చోటు చేసుకుంది. ‘విశ్వాసం' చిత్రం ఈ గ్రామంలోనే చిత్రీకరించారు. ఈ చిత్రానికి సిరుతై శివ దర్శకత్వం వహించారు. నయనతారతో పాటు రోబో శంకర్, తంబిరామయ్య ముఖ్యపాత్రల్లో నటించారు.

భారీ అంచనాలు
అజిత్ కెరీర్లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మాస్ మూవీగా ‘విశ్వాసం' చిత్రాన్ని పేర్కొంటున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఇందులో అజిత్ తూకుదురై పాత్రలో కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











