twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరో అభిమానులని కెలికింది.. బలైపోతున్న సీనియర్ హీరోయిన్, ఏం జరిగిందంటే!

    |

    తమిళనాట తలా అజిత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సపరేటుగా చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం అజిత్ నటిస్తున్న చిత్రం విశ్వాసం. దర్శకుడు శివ, అజిత్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న నాల్గవ చిత్రం ఇది. అజిత్ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. త్వరలో ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోండడంతో విశ్వాసం చిత్ర హ్యాష్ ట్యాగులతో అభిమానులు సోషల్ మీడియాని మోతెక్కిస్తున్నారు. ఈ విషయంలో అజిత్ ఫ్యాన్స్ చేతిలో ఓ సీనియర్ హీరోయిన్ బలైపోతోంది.

    పాటలతో పండగ

    పాటలతో పండగ

    తమిళనాట మాస్ అభిమానులకు బాగా కనెక్ట్ అయిన హీరో అజిత్. అజిత్ అంటే పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల విశ్వాసం చిత్ర పాటలు విడుదలయ్యాయి. దీనితో అజిత్ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ట్విట్టర్, పేస్ బుక్ ఇలా అన్ని సామజిక మాధ్యమాలు విశ్వాసం చిత్ర సందడితో మోతెక్కిపోతున్నాయి.

    ఏంటీ తలనొప్పి

    ఏంటీ తలనొప్పి

    సోషల్ మీడియాలో అజిత్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ చూసి చికాకు పుట్టిందో ఏమో కానీ సీనియర్ హీరోయిన్ కస్తూరి సహనం కోల్పోయింది. అజిత్ ని అభిమానులు ముద్దుగా తలా అని పిలుచుకుంటారు. దానిని కాస్త వెటకారంగా మారుస్తూ ఏంటీ తల తలైవలి మాకు అంటూ కస్తూరి ట్వీట్ చేసింది. తలైవలి అంటే తలనొప్పి అని అర్థం. సాధారణంగానే అజిత్ అభిమానులు దూకుడు మీద ఉంటారు. ఇక ఇలా రెచ్చగొట్టేలా ట్వీట్ చేస్తే ఊరుకుంటారా.. అజిత్ ఫ్యాన్స్ ట్రోలింగ్ కు కస్తూరి బలైపోతోంది.

    ఇంకా పరిణితి చెందలేదు

    ఇంకా పరిణితి చెందలేదు

    అజిత్ అభిమానులు భీభత్సంగా కస్తూరిని ట్రోల్ చేస్తున్నారు. కస్తూరి ఇంకా పరిణితి చెందలేదు. ఆమె చాలా విషయాలు నేర్చుకోవాలి అని కామెంట్స్ పెడుతున్నారు. అజిత్ ఫాన్స్ ఫైర్ మీద ఉండడంతో కస్తూరి ఎలాంటి స్పందన తెలియజేయకుండా సైలెంట్ గా ఉండిపోయింది.

    అన్నమయ్య చిత్రంలో

    అన్నమయ్య చిత్రంలో

    కస్తూరి తెలుగులో అన్నమయ్య చిత్రంలో నాగార్జున సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు బాలయ్య నిప్పురవ్వ చిత్రంలో కూడా నటించింది. ఇప్పటికి కొన్ని తమిళ చిత్రాల్లో కస్తూరి నటిస్తూనే ఉంది. కస్తూరి సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్. చాలా విషయాలపై తన అభిప్రాయాలు తెలియజేస్తూ ఉంటుంది.

    English summary
    Ajith fans brutally trolled senior heroine Kasturi. Here is the reason
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X