నాడు చేసిన దానికి ప్రతీకారం.. ప్రణాళిక సిద్దం చేసిన అజిత్ ఫ్యాన్స్..దళపతి బర్త్ డేపై ట్విట్టర్ వార్

కోలీవుడ్‌లో జరిగే ఫ్యాన్స్ వార్ మరెక్కడా కనిపించవు. సినిమాలు, రికార్డుల విషయంలో ఎలాగో ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం వస్తుంది. అది అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఎవ్వరూ కూడా తప్పుబట్టరు. కానీ కోలీవుడ్‌లో మాత్రం మరో విషయంలోనూ ఫ్యాన్స్ మధ్య యుద్దం నెలకొంటుంది. అదే తమ హీరోల పుట్టినరోజు. బర్త్ డే నాడు అందరూ హ్యాపీగా ఉండాల్సింది పోయి.. ఆ రోజున కూడా వాగ్వాదానికి తెగబడతారు. విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య బర్త్ డే వార్ కూడా ఆసక్తికరంగా సాగుతుంది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

Recommended Video

Thalapathy Vijay Birthday : Watch Jagan & Actor Vijay Posters In TN || Oneindia Telugu
బర్త్ డే రోజున కూడా..

బర్త్ డే రోజున కూడా..

మే 1న తలా అజిత్ పుట్టినరోజు. అయితే ఈ విషయాన్ని ట్రెండ్ కానివ్వకుండా.. తమ హీరోనే గ్రేట్ అని చాటిచెప్పేలా విజయ్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ఇక దీంతో అప్పటి వరకు సినిమాల వరకే ఉన్న ఈ పోరు బర్త్ డేలపైనా పడింది. నాడు అజిత్ బర్త్ డే వైరల్ కాకుండా అడ్డుపడ్డ విజయ్ ఫ్యాన్స్‌కు తలా అభిమానులు సమాధానం చెప్పేందుకు రెడీ అవుతున్నారు.

ట్విట్టర్ వార్..

ట్విట్టర్ వార్..

అజిత్ బర్త్ డే రోజున కావాలని #VijayTheFaceOfKollywood అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాపంగా వైరల్ చేశారు. దాదాపు 1.5 మిలియన్ల ట్వీట్లు చేసి ట్రెండ్ సెట్ చేశారు. దీంతో అజిత్ బర్త్ డేకు ఉండాల్సిన సందడి అంతా పక్కకు జరిగింది. అందుకే రేపటి (జూలై 22) విజయ్ బర్త్ డేను నాశనం చేసేందుకు తలా ఫ్యాన్స్ కంకణం కట్టుకున్నారు.

 మొదలైన సందడి..

మొదలైన సందడి..

దళపతి విజయ్ బర్త్ డే సందడి ఎప్పుడో మొదలైంది. కామన్ డీపీ దక్షిణాదికి చెందిన దాదాపు 21 మంది సెలెబ్రిటీలతో రిలీజ్ చేయింది ట్రెండ్ సెట్ చేశారు. విజయ్ కామన్ డీపీయే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. #THALAPATHYBdayFestCDP ఇండియాలోనే అత్యదికంగా ట్రెండ్ అయిన జాబితాలో నిలిచింది. 5.2 మిలియన్ ట్వీట్స్‌తో దళపతి దళం సత్తా చాటింది.

రెడీ అవుతున్న అజిత్ ఫ్యాన్స్...

రెడీ అవుతున్న అజిత్ ఫ్యాన్స్...

అయితే విజయ్ బర్త్ డే రోజున తమ హీరో సత్తా చాటాలని తలా ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఈ మేరుకు నేటి ఉదయం నుంచే అందరూ దానికి సన్నద్దమవుతున్నారు. ఈ మేరకు #ThalaFansDay అనే హ్యాష్ ట్యాగ్‌తో నానా రచ్చ చేస్తున్నారు. రేపటి కార్యాచరణ గురించి అంతా చర్చించుకుంటున్నారు.

రేపు ఉదయం పది గంటలకు..

రేపు ఉదయం పది గంటలకు..

రేపు ఉదయం పది గంటలకు కొత్త హ్యాష్ ట్యాగ్ రిలీజ్ చేస్తామని ఫ్యాన్స్ క్లబ్ ప్రకటించింది. అందరూ ఒకే సమయానికి ఆ హ్యాష్ ట్యాగ్ వాడాలని, పది గంటల నుంచి పండుగ ప్రారంభం కావాలని అందరూ ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. మరి విజయ్ ఫ్యాన్స్ వీటికి ఏవిధంగా సమాధానం చెబుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X