హీరోను పొగిడి ఇరకాటంలో పడిన వనిత విజయకుమార్.. ఏం చేసినా తిట్టేస్తున్నారు!
కోలీవుడ్ నటి వనిత విజయకుమార్ ఏం చేసినా కూడా ఓ కొత్త వివాదానికి దారి తీస్తోంది. ఆమె మంచి కోసం స్పందించినా కూడా తమిళ జనాలు ఏ మాత్రం మెచ్చుకోవడం లేదు. ఇక కోలీవుడ్ లో అమ్మడు ఇప్పుడు స్టార్ హీరోల అభిమానుల మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు లేని విధంగా అజిత్ పై పాజిటివ్ కామెంట్స్ చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. ఆ హీరో అభిమానులు కూడా బ్యూటీ సపోర్ట్ ని ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు.

ఎప్పుడైతే మూడవ పెళ్లి చేసుకుందో..
వనిత విజయ్ కుమార్ ఎప్పుడైతే మూడవ పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి. దానికి తోడు ఆమె వివాహం చేసుకున్న పీటర్ పాల్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోవడం విషయం కోర్టు వరకు వెళ్లింది. ఈ విషయంలో కొంతమంది సినీ నటులు కూడా వనితపై మండిపడుతున్నారు.

శత్రువులు గట్టిగానే ఉన్నారు..
కోలీవుడ్ ఇండస్ట్రీలో వనిత ఎంతమంది స్నేహితులను సంపాదించుకుందో తెలియదు గాని శత్రువులను మాత్రం గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. రోజుకో సినీ సెలబ్రెటీ ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ గొడవలో వనిత అజిత్ 28 ఏళ్ల సినీ ప్రస్థానంపై ఒక ట్వీట్ చేసింది.

నీ లాంటి వ్యక్తిని నేను చూడలేదు
'నిజంగా నమ్మలేకపోవుతున్నాం. మేము అందరం కూడా ఇండస్ట్రీలోకి కలిసి ఒకేసారి ఎంట్రీ ఇచ్చాము. మేము ఈ జీవితంలో బెస్ట్ అండ్ వరస్ట్ మూమెంట్స్ ని చూశాము. అయితే నువ్వు నీ ప్రతి అడుగులో సక్సెస్ చూశావు. నీ లాంటి మంచి వ్యక్తిని, సింపుల్ గా ఉండే గుణం గల వారిని నేనెప్పుడు కలవలేదు. అలాగే నీ భార్య శాలుతో ఇంకా నువ్వు మరింత సంతోషాల్ని అందుకోవాలని కోరుకుంటున్నాను' అని వనిత ట్వీట్ చేసింది.

అభిమానుల ఆగ్రహం
అంతా బాగానే చేసినప్పటికీ అజిత్ ఫ్యాన్స్ చాలా వరకు వనితపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నీ లాంటి వ్యక్తిత్వం లేని మనిషి యొక్క విషెస్ అజిత్ కి ఎంతమాత్రం అవసరం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తనపై ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా వనిత సోషల్ మీడియా ద్వారా ఎదో ఒక విధంగా స్పందిస్తూనే ఉంది. ఇక అజిత్ ని పొగిడి అభిమానుల మనసు గెలుచుకుందామని అనుకున్న వనిత ప్లాన్ రివర్స్ అయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











