20 ఏళ్ల హీరోయిన్‌తో 50 ఏళ్ల స్టార్ హీరో లిప్‌లాక్.. మరో హీరో ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్!
దాదాపు ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా కూడా హీరోలని ఒక 50, 60 వయసొచ్చినా కూడా వారి అభిమానులు అతన్ని హీరోగా యాక్సెప్ట్ చేస్తారు దీనితో ఇండస్ట్రీలో హీరోలకి మాత్రం ఎలాంటి డోకా లేకుండా కెరీర్ సాగిపోతుంది. కానీ ఇదే ఫార్ములా హీరోయిన్స్ విషయంలో మాత్రం వర్కౌట్ కాదు. దీనితో ఎప్పటి నుంచో ఎందరో హీరోయిన్స్ లో ఈ కంప్లైంట్ అనాదిగా వస్తూనే ఉంది.
అయినా కూడా ఈ ట్రెండ్ లో మాత్రం పెద్దగా మార్పు ఉండట్లేదు. ఇలా పెద్ద వయసున్న హీరోలు ఇప్పటికీ తమ ఏజ్ లో సగం ఉన్న హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తూనే ఉన్నారు. సరే ఇక్కడ హీరోయిన్స్ కి కూడా లేని ప్రాబ్లమ్ లు సోషల్ మీడియాలో ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ కి మాత్రం వచ్చేస్తూ ఉంటాయి. కాగా ఈ ఆడియెన్స్ ఇటీవల మన టాలీవుడ్ హీరో మాస్ మహారాజ్ రవితేజపై చాలా ట్రోల్స్ చేశారు.

తన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్ సహా చిత్రాల్లో రవితేజ యంగ్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తుంటాడు అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా ట్రోలింగ్ పెరిగింది. కాగా ఈ అంశంపై కోలీవుడ్ కి చెందిన జనం కూడా బాగానే నీతులు చెప్పారు. కానీ ఇదే తమిళ ఆడియెన్స్ అడ్డంగా బుక్ అయ్యారు.
తమిళ్ నుంచి తాజాగా వచ్చిన సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే సినిమాలో విజయ్ దళపతిపై ఓ సీన్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ ఓ సీన్ లో హీరోయిన్ మీనాక్షి చౌదరిని పెదవి ముద్దు పెట్టుకుంటాడు. దీనితో రవితేజ ఫ్యాన్స్ ఇది పట్టుకున్నారు. అప్పుడు రవితేజని భాగ్యశ్రీ విషయంలో ట్రోల్ చేసిన వారు ఇప్పుడు 50 ఏళ్ళకి పైగా వయసున్న హీరో 20 ఏళ్ల ప్లస్ వయసున్న హీరోయిన్ తో ఇలా పెదవి ముద్దులు పెట్టొచ్చా అంటూ ట్రోల్స్ స్టార్ట్ చేసారు.

దీనితో ఇప్పుడు రవితేజ ఫ్యాన్స్ టైం వచ్చింది అని చెప్పాలి. కాగా ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మరో యాదృచ్చికం ఏమిటంటే.. ఇదే మీనాక్షి చౌదరి తన మొదటి సినిమా రవితేజతో "ఖిలాడీ" అనే సినిమాతో ఇవ్వగా ఆ సినిమాలో కూడా రవితేజతో లిప్ కిస్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇదే హీరోయిన్ విషయంలో అదే లిప్ కిస్ తో మరో 50 ప్లస్ ఏజ్ ఉన్న ఫ్యాన్స్ ట్రోల్స్ కి బలయ్యారు అని చెప్పాలి.
సినిమా అన్నాక హీరోయిన్స్ కి లేని సమస్యలు ఈ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ కి మాత్రమే ఎందుకు వస్తున్నాయో అర్ధం కావడం లేదని కొందరు అంటుంటారు. మరి ఇండస్ట్రీలో హీరోయిన్స్ కే లేని ప్రాబ్లమ్ మీకేంటి అని రీసెంట్ గా దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఫైర్ అయ్యిన సంగతి తెలిసిందే. సో వారు ఇలాంటి విషయాల్లో కొంచెం లిమిటెడ్ గానే ఉంటే బెటర్ అని చెప్పాలి. ప్రస్తుతం విజయ్ సినిమాకి అయితే అంత గొప్ప రిపోర్ట్స్ ఏమీ రావడం లేదు. పైగా ఈ సినిమాలో కూడా మీనాక్షి రోల్ కి అన్యాయం జరిగింది అని ఆమె ఫాలోవర్స్ బాధ కూడా పడుతున్నారు.


Click it and Unblock the Notifications











