దెబ్బకు దెబ్బ కొట్టారు.. బరిలో అజిత్ అభిమానులు.. దళపతి ఫ్యాన్స్‌కు నిరాశ
కోలీవుడ్‌లో జరిగే యుద్దాలు, వాగ్వాదాలు అందరికీ తెలిసిందే. హీరోలను దైవాలుగా కొలిచే సంస్కృతి దక్షిణాదిలోనే ఎక్కువగా ఉంటే.. అందులోని కోలీవుడ్‌లో పరకాష్టకు చేరుకుంటుంది. ఏకంగా హీరో హీరోయిన్లకు గుళ్లు కూడా కడతారు. తేడా వస్తే ఎదుటి హీరో అభిమానుల ప్రాణాలను కూడా తీస్తారు. తమిళ అభిమానుల్లో ఉండే ఈ ప్రేమే కొన్ని సార్లు వివాదానికి దారి తీస్తాయి. తమ హీరో గొప్ప అంటే తమ హీరోనే గొప్ప అని యుద్దానికి దిగుతారు. తమ హీరో ఆధిపత్యాన్ని చాటేందుకు ఎంతకైనా తెగిస్తారు. ఈ విషయంలో తలా అజిత్, దళపతి విజయ్ ఫ్యాన్స్ ముందుంటారు.

నిరంతరం వాగ్వాదం..
అజిత్, విజయ్ ఫ్యాన్స్ నిరంతరం కొట్టుకుంటూనే ఉంటారు. ఏదో ఒక విషయంలో ఇరు ఫ్యాన్స్ మధ్య మాటల యుద్దం వస్తూనే ఉంటుంది. వారి ప్రతాపాన్ని చూపేందుకు ట్విట్టర్‌ను వాడుకుంటారు. ట్విట్టర్‌లో జరిగే ఈ ఇరువురి హీరోల అభిమానుల గోల దేశమంతా చూస్తుంటుంది.

బర్త్ డేలను కూడా..
హీరోల బర్త్ డేల సమయంలోనైనా ఫ్యాన్స్ సక్రమంగా ఉంటారా? అంటే అదీ లేదు. అజిత్ బర్త్ డేన VijayTheFaceOfKollywood అనే హ్యాష్ ట్యాగ్‌తో విజయ్ ఫ్యాన్స్ చేసిన రచ్చకు బదులు తీర్చుకుంటున్నారు తలా ఫ్యాన్స్. నాడు అజిత్ బర్త్ డేను ట్రెండ్ అవ్వకుండా చేసి విజయ్ ఫ్యాన్స్ ఆధిపత్యాన్ని చాటగా నేడు అజిత్ అభిమానుల వంతు వచ్చింది.

రంగం సిద్దం చేసి..
విజయ్ బర్త్ డే రోజున తమ హీరో సత్తా చాటాలని తలా ఫ్యాన్స్ రెడీ అయ్యారు. నిన్ననే ప్రణాళికను రచించారు. #ThalaFansDay అనే హ్యాష్ ట్యాగ్‌తో నిన్న నానా రచ్చ చేసి.. నేటి కార్యాచరణ గురించి అంతా చర్చించుకున్నారు. చెప్పినట్టుగా ఈ రోజు ఉదయం పది గంటలకు కొత్త హ్యాష్ ట్యాగ్‌తో రంగంలోకి దిగారు.

బరిలో అజిత్ ఫ్యాన్స్..
NonpareilThalaAJITH అనే హ్యాష్ ట్యాగ్‌తో నేటి ఉదయం పది గంటల నుంచి యుద్దాన్ని ప్రకటించారు. ఈ దెబ్బకు విజయ్ ఫ్యాన్స్ తల్లడిల్లిపోతున్నారు. విజయ్ బర్త్ డేను క్రాస్ చేసిన అజిత్ ఫ్యాన్స్ ముందంజలో ఉన్నారు. అజిత్ ఫ్యాన్స్ ఇప్పటికి 705k ట్వీట్స్ చేయగా.. విజయ్ ఫ్యాన్స్ 369k ట్వీట్లు మాత్రమే చేశారు.
Recommended Video

ట్రెండ్ కావడం లేదు..
విజయ్ బర్త్ డే నేషనల్ వైడ్‌గా ట్రెండ్ కావడం లేదు. దీనికి సుశాంత్ ఆత్మహత్య కూడా ఓ కారణం. నెటిజన్లు నేటి ఉదయం నుంచి బాయ్ కాట్ ఖాన్స్, సోనమ్ కపూర్ హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నారు. అందుకే విజయ్ బర్త్ డే అంతగా హల్చల్ కావడం లేదు. దీనికి తోడు అజిత్ ఫ్యాన్స్ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.


Click it and Unblock the Notifications











