Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కార్‌పై స్టంట్ చేస్తూ గాయపడ్డ అజిత్....(వీడియో)
ముంబై: తమిళ హీరో అజిత్ దాదాపు నెలన్నర క్రితం షూటింగులో గాయపడ్డ సంగతి తెలిసిందే. విష్ణువర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నటిస్తున్న అజిత్ యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తూ గాయపడ్డాడు. ఆ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.
కారు పైకి దూకి స్టంట్స్ చేస్తుండగా ఆయన కుడి కాలు నేలకు తగిలి గాయమైంది. వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. ముంబైలో షూటింగ్ జరుగుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ చిత్రం షూటింగులో నయనతార, తాప్సి, ఆర్య, సుమన్ రంగనాథ్, అతుల్ కులకర్ణి, మహేష్ మంజ్రేకర్ తదితరులు నటిస్తున్నారు. అజిత్ కోలుకున్న తర్వాత తిరిగి షూటింగులో పాల్గొననున్నాడు.
ఈ
క్రింది
ఫోటోను
క్లిక్
చేసి
వీడియో
వీక్షించండి
ఈ చిత్రంలో అజిత్ మిడిల్ ఏజ్ కంప్యూటర్ హాకర్ గా నటిస్తున్నాడు. ఇటీవల వచ్చిన 'గ్యాంబ్లర్' చిత్రం తర్వాత అజిత్ మళ్లీ ఈ చిత్రంలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నాడు. గతంలో వచ్చిన తమిళ చిత్రం 'బిల్లా'లో అజిత్-నయనతార మధ్య రొమాన్స్ బాగా పండాయి. మళ్లీ ఇందులో ఇద్దరు కలిసి నటిస్తుండటం అంచనాలను పెంచుతోంది.
అజిత్ తర్వలో 'దరువు' దర్శకుడు శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయున్నట్లు తెలుస్తోంది. విజయ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. శౌర్యం' చిత్రంతో దర్శకత్వం వైపు అడుగులు వేసిన కెమెరామెన్ శివ. అంతకు ముందు ఛాయాగ్రాహకుడిగా 'శ్రీరామ్', 'నేనున్నాను' లాంటి చిత్రాలకు పని చేశారు.