దటీజ్ రజనీ: అజిత్

ఈ ప్రాజెక్టు నిమిత్తం ఇప్పటికే అజిత్, విష్ణువర్ధన్‌లతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్లివచ్చాక ఆ ఇద్దరూ స్క్రిప్ట్ పనిలో కూర్చోనున్నారు. ఓచర్ తొలి ప్రాజెక్టులో అజిత్‌ను హీరోగా తీసుకోవడమనేది రజనీకాంత్ ఆలోచనేట. దాదాపు 30 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనున్నారు. 2009లో ఇది సెట్స్ మీదకు వెళ్లనున్నది. ఈలోగా శివాజీ ప్రొడక్షన్స్ నిర్మించే సినిమాను అజిత్ పూర్తి చేయనున్నాడు. సినిమా సంగతెలా ఉన్నా ఒక సూపర్ స్టార్ మరొక హీరోని ఎంక్రేజ్ చెయ్యటం మాత్రం విశేషమని చెప్పుకుంటున్నారు. అజిత్ మాత్రం ఉద్వేగంగా 'దటీజ్ రజనీ!' అంటున్నాడట.


Click it and Unblock the Notifications