భారతీయుడు సీక్వెల్ హీరో కమల్ కాదు..మరి

By Srikanya

శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడా చిత్రం సీక్వెల్ తీయటానకి దర్శకుడు శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ చిత్రంలో హీరోగా కమల్ ని కాకుండా అజిత్ ని తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. జీన్స్ సమయంలోనే శంకర్,అజిత్ కలిసి పనిచేయాల్సింది కానీ కుదురలేదు. దాంతో ఇన్నాళ్ళకు ఆ టైమ్ వచ్చినట్లు భావిస్తున్నారు. అందులోనూ గ్లాంబ్లర్ చిత్రం ఘన విజయం సాధించటంతో శంకర్ ఈ హీరోతో చెయ్యాలని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం శంకర్.. త్రీ ఇడియట్స్ రీమేక్ చిత్రం చేస్తున్నారు.

హిందీలో ఘనవిజయం సాధించిన 'త్రీ ఇడియట్స్" చిత్రం కావటం,శంకర్ దర్సకత్వం లో సినిమా రావటంతో మంచి క్రేజ్ వస్తోంది. అమీర్‌ఖాన్, మాధవన్, శర్మన్‌జోషి నటించిన ఈ చిత్రం రైట్స్ ని జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ సొంతం చేసుకుని నిర్మిస్తున్నారు. ఇక తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్న ఈ చిత్రంలో అమీర్‌ఖాన్ పాత్రకు విజయ్‌ను,ఇతర రెండు పాత్రలకు జీవా, శ్రీరామ్‌లను చేస్తున్నారు. మరో కీలక పాత్రలో సత్యరాజ్ నటిస్తున్నారు. హీరోయిన్‌గా ఇలియానా అదరకొట్టనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X