twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాక్సిడెంట్ అయినా తగ్గని స్టార్ హీరో: బైక్‌ను అమాంతం గాల్లోకి లేపేశాడు

    |

    తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోనే అయినా.. సుదీర్ఘ కాలంగా తన హవాను చూపిస్తూ దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నాడు తలా అజిత్ కుమార్. స్టైలిష్ లుక్, విలక్షణమైన నటనతో అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న ఆయన.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆ మధ్య పరాజయాల పరంపరతో సతమతమైన అజిత్.. 'నెర్కొండ పార్వాయి'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. బాలీవుడ్ మూవీ 'పింక్'కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా కోలీవుడ్‌లో ఎన్నో రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే.

    'నెర్కొండ పార్వాయి' వంటి భారీ హిట్ తర్వాత అజిత్ కుమార్ నటిస్తున్న చిత్రం 'వాలిమై'. హెచ్ వినోద్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ఇటీవలే ఓ స్టంట్ చేస్తోన్న సమయంలో అజిత్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దాని నుంచి కోలుకున్న తర్వాత ఈ సీనియర్ హీరో షూటింగ్‌ను రీస్టార్ట్ చేశాడు. ఈ క్రమంలోనే చిత్రీకరణ సమయంలో డూప్ లేకుండా చేసిన ఓ బైక్ స్టంట్‌కు సంబంధించిన ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

    Ajith Kumar Bike Stunts Create Buzz on Valimai

    సూపర్ హిట్ సినిమా తర్వాత వస్తున్న 'వాలిమై'పై తమిళ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. వాటికి ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే, ఇందులో స్టారింగ్ కూడా అదే స్థాయిలో ఉండేలా చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో భాగంగానే ఈ మూవీలో విలన్‌గా తెలుగు హీరో 'RX100' ఫేం కార్తికేయ నటిస్తున్నాడు. ఈ సినిమాలో అజిత్ బైక్ రేసర్‌గా, మధ్య వయస్కుడిగా రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    English summary
    Fresh rumor on social media is that Thala Ajith has been approached to play the lead role in the Tamil remake of Ayushmann Khurrana's critically acclaimed hit film 'Article 15'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X