Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
యాక్సిడెంట్ అయినా తగ్గని స్టార్ హీరో: బైక్‌ను అమాంతం గాల్లోకి లేపేశాడు
తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోనే అయినా.. సుదీర్ఘ కాలంగా తన హవాను చూపిస్తూ దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నాడు తలా అజిత్ కుమార్. స్టైలిష్ లుక్, విలక్షణమైన నటనతో అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న ఆయన.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆ మధ్య పరాజయాల పరంపరతో సతమతమైన అజిత్.. 'నెర్కొండ పార్వాయి'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. బాలీవుడ్ మూవీ 'పింక్'కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా కోలీవుడ్‌లో ఎన్నో రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే.
'నెర్కొండ పార్వాయి' వంటి భారీ హిట్ తర్వాత అజిత్ కుమార్ నటిస్తున్న చిత్రం 'వాలిమై'. హెచ్ వినోద్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ఇటీవలే ఓ స్టంట్ చేస్తోన్న సమయంలో అజిత్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దాని నుంచి కోలుకున్న తర్వాత ఈ సీనియర్ హీరో షూటింగ్‌ను రీస్టార్ట్ చేశాడు. ఈ క్రమంలోనే చిత్రీకరణ సమయంలో డూప్ లేకుండా చేసిన ఓ బైక్ స్టంట్‌కు సంబంధించిన ఫొటో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
సూపర్ హిట్ సినిమా తర్వాత వస్తున్న 'వాలిమై'పై తమిళ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. వాటికి ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే, ఇందులో స్టారింగ్ కూడా అదే స్థాయిలో ఉండేలా చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో భాగంగానే ఈ మూవీలో విలన్‌గా తెలుగు హీరో 'RX100' ఫేం కార్తికేయ నటిస్తున్నాడు. ఈ సినిమాలో అజిత్ బైక్ రేసర్‌గా, మధ్య వయస్కుడిగా రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.