twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి సినిమాలో అతిథి పాత్రలో ‘బిల్లా’

    By Bojja Kumar
    |

    చెన్నయ్: ఒకప్పటి అందాల తార శ్రీదేవి చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. గౌరీ షిండే దర్శకత్వం వహిస్తున్న 'ఇంగ్లిష్ వింగ్లిష్" చిత్రం ద్వారా ఆమె మళ్లీ రంగుల సినీ ప్రపంచంలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇంగ్లీష్ సరిగా మాట్లాడటం రాని ఓ గృహిణి పాత్రలో నటిస్తున్నారు శ్రీదేవి.

    చెన్నయ్ నుంచి వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ఈ చిత్రంలో తమిళ నటుడు, బిల్లా మూవీ హీరో అజిత్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అతనిపై కొన్ని సీన్లు చిత్రీకరించారని తెలుస్తోంది. శ్రీదేవికి వీరాభిమాని అయిన అజిత్ ఆ చిత్ర దర్శకులు అడగ్గానే మరో ఆలోచన లేకుండా వెంటనే ఒకే చెప్పాడట.

    ఇంగ్లీష్ వింగ్లిష్ చిత్రాన్ని బాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషల్లో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అజిత్‌తో నటింపజేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత హౌస్ వైఫ్ గా సెటిలైన శ్రీదేవి ఇంతకాలం తన ఇద్దరు కూతుర్ల బాగోగులు చూసుకుంటూ గడిపేసింది. అలా అని అందాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పటికీ సన్నటి తీగలా నవనవలాడుతోంది. మరి శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ ఏమేరకు సక్సెస్ అవుతుందో..

    English summary
    Ajith Kumar, who was seen in many extended-guest roles before, has done a special appearance in a forthcoming Tamil movie. Well, the Thala will be seen doing the cameo in the forthcoming bilingual movie English Vinglish, which is a comeback movie of yesteryear sensational actress Sridevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X