For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బైక్‌పై ఆ దేశాన్ని చుట్టేస్తున్న స్టార్ హీరో: షూటింగ్ పూర్తైనా అక్కడే ఉంటూ హల్‌చల్

  |

  పేరుకు తమిళ సినీ పరిశ్రమకు చెందిన హీరోనే అయినా దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నాడు కోలీవుడ్ స్టార్ థలా అజిత్ కుమార్. విలక్షణమైన నటన, విభిన్నమైన స్టైల్స్‌తో ఎన్నో చిత్రాలను వన్ మ్యాన్ షోగా మార్చుకున్న ఈ సీనియర్ హీరో.. సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. నిన్న మొన్నటి వరకూ ఫ్లాపుల పరంపరతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన.. పింక్‌కు రీమేక్‌గా వచ్చిన 'నెర్కొండ పార్వాయి'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. దీంతో అజిత్ కుమార్ రెట్టించిన ఉత్సాహంతో మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతున్నాడు.

  Evaru Meelo Koteeswarulu షోకు షాకింగ్ రేటింగ్: చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. దానితో పోలిస్తే మాత్రం!

  థలా అజిత్ కుమార్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం 'వాలిమై'. హెచ్ వినోథ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే, మధ్యలో అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో చిత్రీకరణ చాలా ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలోనే ఆ మధ్య హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. ఇక, ఇటీవలే ఫైనల్ షూట్ కోసం చిత్ర యూనిట్ రష్యా వెళ్లింది. అక్కడ మేజర్ యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించారు. ఇక, రెండు రోజుల క్రితమే ఆ షెడ్యూల్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అజిత్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

  Ajith Kumar Completed Valimai Shoot and Went Bike Trip in Russia

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'వాలిమై' మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైంది. దీంతో చిత్ర యూనిట్ మొత్తం ఇండియాకు కూడా బయలుదేరింది. కానీ, అజిత్ కుమార్ మాత్రం రష్యాలోనే ఉన్నాడని తెలుస్తోంది. స్వతహాగా రేసర్ అయిన ఈ సీనియర్ హీరోకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. దీంతో ఇప్పుడు రష్యా దేశం మొత్తాన్ని బైక్‌పై చుట్టి రాబోతున్నాడట అజిత్. ఇందుకోసం ఇప్పటికే 900 కిలో మీటర్ల మేర రూట్ మ్యాప్‌ను కూడా సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది. అంతేకాదు, ఆల్రెడీ బైక్ టూర్‌ను కూడా ప్రారంభించేశాడట ఈ కోలీవుడ్ స్టార్ హీరో.

  అజిత్ కుమార్ బైక్‌పై రష్యా దేశాన్ని చుట్టి రాబోతున్నాడన్న వార్తలు బయటకు వచ్చిన వెంటనే.. దానికి సంబంధించిన ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీ క్యాప్స్ పెట్టుకుని, డ్రైవింగ్ సూట్ వేసుకుని అందులో కనిపిస్తున్నాడీ స్టార్ హీరో. దీంతో అజిత్ కుమార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో తమ అభిమాన హీరోకు అల్‌ ది బెస్ట్ అని చెబుతూ జాగ్రత్తగా వెళ్లమని సూచనలు చేస్తున్నారు.

  అనసూయకు నెలలు అంటూ అభి సంచలన వ్యాఖ్యలు: ప్రెగ్నెన్సీపై అందరి ముందే ఊహించని ఆన్సర్

  భారీ బడ్జెట్‌తో ఎంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'వాలిమై' మూవీలో అజిత్ కుమార్ డుయల్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి బైక్ రేసర్ పాత్ర అని కూడా అంటున్నారు. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఇందులో తెలుగు యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా నటిస్తున్నాడు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ దీన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో హుమా ఖురేషి కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

  English summary
  Kollywood Star Hero Ajith Kumar Upcoming Movie Valimai. This action thriller film written and directed by H. Vinoth. Recently Ajith Kumar Completed Valimai Shoot and Went Bike Trip in Russia.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X